WPL Final 2024: ఒకే ఓవ‌ర్ లో 3 వికెట్లు.. ఢిల్లీని దెబ్బ‌కొట్టిన సోఫీ మోలినెక్స్

WPL Final 2024: ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్  రెండ్ సీజ‌న్ (డ‌బ్ల్యూపీఎల్ 2024) లో ఫైన‌ల్ మ్యాచ్ లో బెంగ‌ళూరు టీమ్ అద్భుత‌మైన బౌలింగ్ తో అద‌ర‌గొట్టింది. ఆర్సీబీ బౌల‌ర్లు శ్రేయాంక పాటిల్, సోఫీ మోలినెక్స్ సూప‌ర్ బౌలింగ్ తో ఢిల్లీ క్యాపిటల్స్ ను దెబ్బ‌తీశారు. 
 

WPL Final 2024 : Sophie Molineux's stunning 3-wicket over one over, Shreyanka Patil dismiss Delhi  Capitals , DC vs RCB RMA

WPL Final 2024 : ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్  రెండ్ సీజ‌న్ (డ‌బ్ల్యూపీఎల్ 2024) లో అద్భుత‌మైన ఆట‌తో రాణించిన ఫైన‌ల్ చేరింది ఢిల్లీ క్యాపిట‌ల్స్. అయితే, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ లో త‌డ‌బ‌డింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ ప‌వ‌ర్ ప్లేలో అద్భుత‌మైన ఆట‌ను ఆడింది. అయితే, ప‌వ‌ర్ ప్లే త‌ర్వాత తొలి వికెట్ ప‌డ‌టంతో ఆ త‌ర్వాత వ‌రుస‌గా వికెట్లు కోల్పోయింది. 18.3 ఓవ‌ర్ల‌లో 113 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ష‌ఫాలీ వ‌ర్మ 44, మెగ్ లాన్నింగ్ 23 ప‌రుగుల‌తో రాణించారు.

ఫైన‌ల్ మ్యాచ్ లో బెంగ‌ళూరు బౌల‌ర్లు నిప్పులు చెరిగారు. అద్భుత‌మైన బౌలింగ్ తో ఢిల్లీని కుప్ప‌కూల్చారు. ముఖ్యంగా ప‌వ‌ర్ ప్లే వ‌ర‌కు ఢిల్లీ చేతితో ఉన్న మ్యాచ్ ను ఫోఫీ మోలినెక్స్ ఒక్క ఓవ‌ర్ తో మ్యాచ్ స్వ‌రూపాన్ని మార్చిప‌డేసి బెంగ‌ళూరు చేతిలోకి తీసుకువ‌చ్చింది. 8వ ఓవర్‌లో తొలి బంతికి షఫాలీ వర్మను (44) ఔట్‌ చేసింది. 3వ బంతికి రోడ్రిగెజ్‌ను (0), 4వ బాల్ కు అలైస్‌ క్యాప్సీ (0) పెవిలియన్‌కు సాగ‌నంపింది.

సోఫీ మోలినక్స్ ఫైనల్ గేమ్‌లో తన జట్టుకు గొప్ప సమయాన్ని అందించేలా చూసుకుంటుంది. ఉమెన్ ప్రీమియర్ లీగ్ (WPL) 2024 ఫైనల్  ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతోంది. ఢిల్లీకి ఓపెన‌ర్లు 64 పరుగులతో మంచి భాగ‌స్వామ్యం అందించారు. అయితే 8వ ఓవర్లో సోఫీ మోలినెక్స్ మ్యాచ్ ను ఆర్సీబీ వైపు తిప్పింది. ఆమె వేసిన మొదటి ఓవర్‌లో 10 పరుగులు ఇచ్చింది కానీ, త‌ర్వాత త‌న ప‌వ‌ర్ ను చూపించింది.

టీ20 ప్రపంచకప్‌కు ముందు ఐసీసీ కీలక నిర్ణయం.. స్టాప్ క్లాక్ రూల్ అంటే ఏమిటి?

జోరు  మీదున్న షఫాలీ వర్మ (44)ను తొలి వికెట్ గా ఔట్ చేసింది ఆ త‌ర్వాత జెమిమా రోడ్రిగ్స్‌ను పెవిలియ‌న్ కు పంపింది. మిడిల్- లెగ్ స్టంప్‌పై టాస్డ్-అప్ డెలివరీని సోఫీ మోలినక్స్ బౌల్డ్ చేసింది. బంతి కొద్దిగా దూరంగా పిచ్ చేయడంతో ఆమె చక్కటి డ్రిఫ్ట్ అందించింది. ఆలిస్ క్యాప్సీని  ఔట్ చేసి బెంగ‌ళూరుకు మంచి బూస్టు అందించింది. చూస్తుండ‌గానే 64/0 నుండి 64/3 ఢిల్లీ ప‌డిపోయింది. కేవలం 6 బంతుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. సోఫీకి జోడిగా శ్రేయాంక పాటిల్ సైతం అద్భుత‌మైన బౌలింగ్ తో ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్‌ను పెవిలియ‌న్ కు పంపింది. 23 ప‌రుగుల వ‌ద్ద మెగ్ లానింగ్ ఔటో అయిన త‌ర్వాత ఢిల్లీ 74/4 ప‌రుగుల‌తో ఆట‌ను కొన‌సాగించింది. అయితే, ఆ త‌ర్వాత వ‌చ్చిన బ్యాట‌ర్స్ పెద్ద‌గా నిల‌బ‌డ‌లేక‌పోవ‌డంతో 18.3 ఓవ‌ర్ల‌లో 113 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. 

 

IPL 2024: విరాట్ కోహ్లీ బెంగ‌ళూరు జట్టులో ఉన్న ఏకైక లోపం అదే.. ! 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios