Asianet News TeluguAsianet News Telugu

WPL 2024: ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. గుజరాత్‌ను ఓడించి.. ముంబైని వెనక్కి నెట్టింది.. 

WPL 2024 RCB vs GGT: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్‌లో RCB రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది. దీంతో ఆ జట్టు కూడా నంబర్ 1 స్థానానికి చేరుకుంది. విశేషమేమిటంటే.. స్మృతి మంధాన సారథ్యంలోని ఈ జట్టు గత సీజన్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలవగలిగింది. కానీ ఈ సీజన్ లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు విజయం సాధించింది.

WPL 2024: Smriti Mandhana, Renuka Singh power RCB to top after beating Giants KRJ
Author
First Published Feb 28, 2024, 2:41 AM IST

WPL 2024 RCB vs GGT: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేవలం రెండు మ్యాచ్‌లను మాత్రమే గెలుచుకుంది. కానీ ఈ సీజన్ లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ వరుసగా విజయం సాధించింది. అంతకుముందు యూపీ వారియర్స్‌పై ఆర్సీబీ విజయం సాధించగా.. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో గుజరాత్‌ను ఘోరంగా ఓడిపోయింది. 

బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్‌పై 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిరాశపరిచింది. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. హేమలత(31) టాప్ స్కోరర్. RCB తరుపున రేణుకా ఠాకూర్, సోఫీ మోలినిక్స్ అద్భుతమైన బౌలింగ్ చేశారు. ఇద్దరూ వికెట్లు తీయడంతో పాటు పరుగులు కూడా ఇవ్వలేదు. మోలినిక్స్ 3 వికెట్లు, రేణుక సింగ్ 2 వికెట్లతో సత్తాచాటి గుజరాత్‌ను కట్టడి చేశారు. 

అనంతరం 108 పరుగుల లక్ష్యంతో వచ్చిన  బెంగళూరు(ఆర్సీబీ) కేవలం 12.3 ఓవర్లలో 2 వికెట్ల మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సునాయసంగా గెలుపొందింది. కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన(43) మెరుపు ఇన్సింగ్స్‌తో చెలరేగారు. ఆమెకు తోడు తెలుగమ్మాయి సభినేని మేఘన (36 నాటౌట్), ఎల్లీస్ పెర్రీ(23 నాటౌట్) రాణించడంతో బెంగళూరు సునాయాసంగా లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంతో బెంగళూరు పాయింట్స్‌ టేబుల్‌లో ముంబై ఇండియన్స్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరుకుంది.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు

ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయంతో రెండు లక్ష్యాలను చేధించింది. తొలుత ఆ జట్టు గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. దీంతో పాటు పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్‌ను కూడా ఆర్‌సీబీ అధిగమించింది. ఇప్పుడు RCB టేబుల్ టాపర్‌గా నిలిచింది. RCB ఆడిన రెండు మ్యాచ్‌లు గెలిచి 4 పాయింట్లు సాధించింది. నెట్ రన్ రేట్ కూడా చాలా బెటర్ గా ఉంది. 

అదే సమయంలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కూడా దాని రెండు మ్యాచ్‌లను గెలుచుకుంది . కానీ  ఈ జట్టు పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. ముంబై నెట్ రన్ రేట్ కూడా 0.488. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండు మ్యాచ్‌లు ఆడి ఒక్కో మ్యాచ్‌లో గెలిచి ఓడిపోయింది. ఢిల్లీ జట్టు 1.222 నెట్ రన్‌రేట్‌తో మూడవ స్థానంలో ఉంది. తద్వారా గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ జట్లు తమ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయాయి. ఈ రెండు జట్లు ఖాతా తెరవలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios