WPL 2024: 8 వికెట్ల తేడాతో గుజరాత్ చిత్తు.. వరుసగా బెంగళూరుకు రెండో విజయం
RCB vs GGW: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 (డబ్ల్యూపీఎల్ 2024) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ వరుసగా రెండో విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో గుజరాత్ ను బెంగళూరు టీమ్ చిత్తుచేసింది.
Royal Challengers Bangalore vs Gujarat Giants: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024) రెండో సీజన్ ఐదో మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ పై విజయం సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 107 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత 108 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీ 12.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి విజయం సాధించింది.
స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ జట్టుకు ఈ టోర్నీలో ఇది వరుసగా రెండో విజయం. అంతకుముందు యూపీ వారియర్స్ పై విజయం సాధించింది. మరోవైపు గుజరాత్ జెయింట్స్ కు ఇది వరుసగా రెండో ఓటమి. ముంబై తర్వాత ఆ జట్టు బెంగళూరుపై ఓటమిని చవిచూసింది. 108 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మంధాన- డివైన్ తొలి వికెట్ కు 32 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సోఫీ 6 పరుగులు చేసింది. స్మృతి మంధాన 27 బంతుల్లో 43 పరుగులు చేసింది.
RANJI TROPHY: క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.. ముంబై ప్లేయర్ల అద్భుత ఫీట్ !
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ జట్టు మరోసారి పేలవంగా ఆరంభించింది. కెప్టెన్ బెత్ మూనీ 7 బంతుల్లో 8 పరుగులతో నిరాశపరిచింది. లిచ్ ఫీల్డ్ కూడా కేవలం 5 పరుగులు మాత్రమే చేసింది. వేద 15 బంతుల్లో 9 పరుగులు చేసింది. హర్లీన్ 31 బంతుల్లో 22 పరుగులు చేసి రనౌట్ అయ్యారు. ఆష్లే గార్డనర్ 12 బంతుల్లో 7 పరుగులు చేశాడు. బ్రైస్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేయగలిగాడు. స్నేహ్ రాణా 12 పరుగులు చేశాడు. హేమలత 25 బంతుల్లో 31 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.
స్కోర్లు:
గుజరాత్ జెయింట్స్ : 107-7 (20)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : 110-2 (12.3)
మోలినెక్స్: 3 వికెట్లు
స్మృతి మంధాన : 43 పరుగులు
ఆశిష్ నెహ్రా నుండి రికీ పాంటింగ్ వరకు.. ఐపీఎల్ కోచ్‌లుగా మారిన టాప్-10 క్రికెట్ దిగ్గజాలు