WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్.. టాస్ గెలిచిన ముంబై.. మెగ్ లానింగ్ అదరగొడుతుందా?

WPL 2024: బెంగళూరు వేదికగా ప్రారంభమైన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో ఎడిషన్ తొలి మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ టాస్ గెలిచింది. గత సీజన్ లో రన్నరఫ్ గా నిలిచిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ 2వ సీజ‌న్ లో తొలి మ్యాచ్ గెలుస్తుందా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. 
 

WPL 2024 MIW vs DCW : Women's Premier League Mumbai Indians won the toss and elected to bat first. Will Meg Lanning be impressed?  RMA

Women's Premier League 2024: మహిళల ప్రీమియర్ లీగ్ రెండో ఎడిషన్ గ్రాండ్ గా ప్రారంభం అయింది. బాలీవుడ్ తార‌ల డాన్సుల‌తో ప్రారంభ కార్యక్ర‌మం అద‌ర‌గొట్టారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే మెగా లీగ్ ప్రారంభ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ ఇన్నింగ్స్ పై ఆస‌క్తిక‌రంగా క్రికెట్ ప్రియులు ఎదురుచూస్తున్నారు.

తొలి మ్యాచ్ డబ్ల్యూపీఎల్ తొలి ఎడిషన్ లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఫైనల్లో మెగ్ లానింగ్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించి ఫైనల్ ఛాంపియన్ గా నిలిచింది. అయితే, గ‌త ఫైన‌ల్ ఓట‌మికి ఇప్పుడు ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని మెగ్ లానింగ్ సార‌థ్యంలోని ఢిల్లీ క్యాపిట‌ల్స్ భావిస్తోంది. 

IND vs ENG : ఆరంభం అదిరింది.. ఇంగ్లాండ్ ను దెబ్బ‌తీసి.. ఎవ‌రీ ఆకాశ్ దీప్.. ?

ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ మాట్లాడుతూ.. "ఇక్క‌డ‌ మంచి వికెట్ లాగా ఉంది.. ప‌రుగుల మంచిగా వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌. నిజంగా ఈ టోర్నీ కోసం ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్నాను. సన్నాహాలు బాగున్నాయి, స్క్వాడ్ బాగా స్థిరపడింది, స్వేచ్ఛతో ఆడాలి. మేము నలుగురు సీమర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బ‌రిలోకి దిగుతున్నామని" చెప్పారు. ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.."గ్రౌండ్ లో మంచు నేప‌థ్యంలో మేము ముందుగా బౌలింగ్ చేయాల‌నుకుంటున్నాం. మాకు బ్యాలెన్స్‌డ్ సైడ్ ఉంది, మా జట్టులో ముగ్గురు అరంగేట్ర ఆటగాళ్లు ఉన్నారు. సానుకూలంగా ఆడాల‌నుకుంటున్నామ‌ని" తెలిపారు. 

టీమ్స్ ఇవే.. 

ఢిల్లీ క్యాపిటల్స్ మహిళలు (ప్లేయింగ్ XI): షఫాలీ వర్మ, మెగ్ లానింగ్ (కెప్టెన్), అలిస్ క్యాప్సే, జెమిమా రోడ్రిగ్స్, మారిజాన్ కాప్, అనాబెల్ సదర్లాండ్, అరుంధతి రెడ్డి, మిన్ను మణి, తానియా భాటియా(వికెట్ కీప‌ర్), రాధా యాదవ్, శిఖా పాండే. 

ముంబై ఇండియన్స్ మహిళలు (ప్లేయింగ్ XI): హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), యాస్తికా భాటియా(వికెట్ కీప‌ర్), అమేలియా కెర్, అమంజోత్ కౌర్, ఎస్ సజన, పూజా వస్త్రాకర్, షబ్నిమ్ ఇస్మాయిల్, కీర్తన బాలకృష్ణన్, సైకా ఇషాక్
IND VS ENG : భార‌త్ పై అత్య‌ధిక సెంచ‌రీలు కొట్టిన టాప్-5 క్రికెట‌ర్లు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios