Asianet News TeluguAsianet News Telugu

WPL 2024: డ‌బ్ల్యూపీఎల్ 2024 ఫైన‌ల్లో ఆర్సీబీ జోరు.. ఢిల్లీ ఢమాల్ !

WPL Final 2024: మహిళల ప్రీమియర్ లీగ్ క్రికెట్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ vs బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. అద్భుత బౌలింగ్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతూ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్స్ ను బెంబేలెత్తిస్తున్నారు. 
 

WPL 2024 Final Royal Challengers Bangalore bowling attack.. Delhi Capitals lost 7 crucial wickets in 14 overs RMA
Author
First Published Mar 17, 2024, 8:44 PM IST

DC vs RCB - WPL Final 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024) రెండో ఎడిష‌న్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్  తలపడుతున్నాయి. అనూహ్యంగా ఫైనల్ కు చేరిన బెంగళూరు టీమ్ ఫైనల్ మ్యాచ్ లో అద్బుత బౌలింగ్ తో ఢిల్లీ టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చారు. 10 ఓవర్లకే ఢిల్లీ క్యాపిటల్స్ కీలకమైన 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 87 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లే వరకు మంచి దూకుడు ఆటను ఆడిన ఢిల్లీ ఆ తర్వాత తడబడింది.

అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ప‌వ‌ర్ ప్లే లో మంచి శుభారంభం ల‌భించింది. షఫాలీ వర్మ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడింది. 27 బంతుల్లో 44 పరుగులు చేసింది. తన ఇన్నింగ్స్ లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదిన తర్వాత మోలినెక్స్ బౌలింగ్ లో క్యాచ్ గా వికెట్ల ముందు దొరికిపోయింది. అప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ 64-1 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అయితే, తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన జెమిమా రోడ్రిగ్స్ డకౌట్ గా వెనుదిరిగింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆలిస్ క్యాస్పేను కూడా సోఫీ మోలినెక్స్ దెబ్బకొట్టింది. మరిజానే కాప్ 8 పరుగులకు, జెస్ జోనాస్సెన్ 3 పరుగులు చేసి ఔట్ అయ్యారు.తొలి వికెట్ పడిన తర్వాత ఒత్తిడికి గురైన ఢిల్లీ బ్యాటర్స్ వరుసగా వికెట్లను సమర్పించుకున్నారు.

సోఫీ మోలినెక్స్ 3 వికెట్లు, ఆశా శోభన 2 వికెట్లు, శ్రేయాంక పాటిట్ 2 వికెట్లు తీశారు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 14.1 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు కోల్పోయి 87 పరుగులతో క్రీజులో రాధా యాదవ్,  అరుంధతి రెడ్డిలు ఉన్నారు. 

IPL 2024: విరాట్ కోహ్లీ బెంగ‌ళూరు జట్టులో ఉన్న ఏకైక లోపం అదే.. !


 

Follow Us:
Download App:
  • android
  • ios