WPL 2023 Auction: భారత మహిళల క్రికెట్ లో కొత్త అధ్యాయానికి తెరలేపుతూ త్వరలో మొదలుకానున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)  తొలి సీజన్ కు ముందు  రేపు (సోమవారం) వేలం ప్రక్రియ జరుగనుంది. 

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్న బీసీసీఐ.. అంతకంటే ముందే ఈ లీగ్ లో తొలిసారిగా నిర్వహించబోయే వేలం ప్రక్రియకు తుది మెరుగులు దిద్దుతున్నది. ఫిబ్రవరి 13న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ కు సంబంధించిన వేలం ప్రక్రియ జరుగనుంది.

డబ్ల్యూపీఎల్ లో ఆడేందుకు ఏకంగా 1,525 మంది ప్లేయర్లు రిజిష్టర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఐదు టీమ్ లు (అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో)లు పాల్గొననున్న ఈ వేలం రేపు మధ్యాహ్నం జరుగనుంది. ఈ నేపథ్యంలో వేలానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం. 

బరిలో ఎంతమంది..? 

- వేలంలో పాల్గొనడానికి వివిధ దేశాల నుంచి 1,525 మంది మహిళా క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో షార్ట్ లిస్ట్ చేయగా 409 మంది మిగిలారని బోర్డు వర్గాల ద్వారా తెలుస్తున్నది. వీరిలో 246 మంది భారత క్రికెటర్లు కాగా 163 మంది ఓవర్సీస్ (విదేశీ) ప్లేయర్లున్నారు.

టీమ్ లో ఎంతమంది..? స్లాట్స్ ఎన్ని..? 

- నిబంధలన ప్రకారం ఒక్కో జట్టు 15 నుంచి 18 మంది ఆటగాళ్లను తీసుకోవచ్చు. వీరిలో ఏడుగురు విదేశీ ప్లేయర్ల (ఒకరు అసోసియేషన్ నేషన్స్) నూ కొనుగోలు చేసుకునే అవకాశముంది. మొత్తం 90 స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. అంటే వీరిలో 60 మంది ఇండియన్ క్రికెటర్స్, 30 మంది ఫారెన్ క్రికెటర్స్ ఉండనున్నారు. 

ధరల వివరాలు..

- తొలి సీజన్ లో ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి బీసీసీఐ రూ. 10 లక్షల బేస్ ప్రైస్ ను నిర్ణయించింది. రూ. 10 లక్షలు, రూ. 20 లక్షలు, రూ. 30 లక్షలు, రూ. 40 లక్షలు, రూ. 50 లక్షల కేటగిరీలలో ఆటగాళ్లను విభజించారు. ఈ ధరల ప్రకారం ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. ఆటగాళ్లను దక్కించుకోవడానికి ఒక్కో టీమ్ రూ. 9 కోట్ల నుంచి రూ. 12 కోట్ల వరకూ ఖర్చు చేయవచ్చు. ఐదు టీమ్ లు కలిపి రూ. 60 కోట్ల దాకా ఖర్చు చేసే అవాకశముంది. 

భారత్ నుంచి..? 

- ఈ లీగ్ లో హయ్యస్ట్ ప్రైస్ (రూ. 50 లక్షల కేటగిరీ) లో భారత స్టార్ క్రికెటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ, షఫాలీ వర్మతో పాటు మరో నలుగురు క్రికెటర్లు ఉన్నారు. మొత్తంగా రూ. 50 లక్షల కేటగిరీలో 24 మంది ఉన్నారు. రూ. 40 లక్షల కేటగిరీలో మొత్తం 30 మంది ప్లేయర్లు ఉండగా ఇందులో 8 మంది ఇండియన్ క్రికెటర్స్ ఉన్నారు.

Scroll to load tweet…

ఎప్పుడు.. ఎక్కడ..? 

- ఫిబ్రవరి 13 (సోమవారం) ముంబై లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా మధ్యాహ్నం 2:30 గంటలకు వేలం మొదలవుతుంది.

ఎలా చూడొచ్చు..? 

- వేలం ప్రక్రియను సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి స్పోర్ట్స్ 18 (వయాకామ్ 18) ఛానెల్స్ లో ప్రత్యక్షంగా వీక్షించొచ్చు. జియో సినిమా యాప్ లో కూడా లైవ్ స్ట్రీమింగ్ ఉంది.

డబ్ల్యూపీఎల్ టీమ్స్ : 

1. అహ్మదాబాద్ (అదానీ- గుజరాత్ జెయింట్స్) - రూ. 1,289 కోట్లు
2. ముంబై (అంబానీ) - రూ. 912.99 కోట్లు 
3. బెంగళూరు (ఆర్సీబీ) - రూ. 901 కోట్లు 
4. లక్నో (క్యాప్రి గ్లోబల్ హోల్డింగ్స్) - రూ. 757 కోట్లు 
5. ఢిల్లీ (ఢిల్లీ క్యాపిటల్స్) - రూ. 810 కోట్లు 
- ఐదు జట్లను వేలం వేయడం ద్వారా బీసీసీఐకి రూ. 4,669 కోట్లు సమకూరింది.