ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. మొన్నటి వరకు టిక్ టాక్ లో వీడియోలు చేసి.. షేర్ చేసి అభిమానులను వార్నర్ అలరించాడు. ఆ టిక్ టాక్ కాస్త బ్యాన్ కావడంతో.. ఇతర డ్యాన్స్ వీడియోలను షేర్ చేయడం మొదలుపెట్టాడు.

ఐపీఎల్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టుకు‌ వార్నర్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సన్ రైజర్స్  జట్టులోని ఆటగాళ్లైన శ్రీలంక మాజీ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌, ఇండియన్‌ ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌లు డ్యాన్స్‌ వీడియోను గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ‘ఈ డ్యాన్సర్స్‌కు పేరు పెట్టండి’ అనే క్యాప్షన్‌ జత చేశాడు.

అది చూసిన ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ‘నాకు నాకు భారత మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ ఆశిష్‌ నెహ్రా డ్యాన్స్‌ కావాలి’ అంటూ సరదాగా కామెంట్‌ చేశాడు. కాగా.. వీరి సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా.. లాక్‌డౌన్‌కు ముందు న్యూజిలాండ్‌తో ఓడీఎల్(వన్‌ డే ఇంటర్‌నేషనల్‌)‌ ఆడిన ఆస్ట్రేలియా.. డిసెంబర్‌ 3 నుంచి ప్రారంభం కానున్న 4 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌తో తలపడనుంది.