ప్రపంచ కప్ ఫైనల్ 2023 : రిచర్డ్ కెటిల్‌బరోపై విరుచుకుపడుతున్న నెటిజన్స్..హోరెత్తుతున్న మీమ్స్..
ఐసిసికి రిచర్డ్ కెటిల్‌బరో కంటే మంచి అంపైర్ దొరకడం లేదా? మనల్ని ఏడిపించడంలో ఈయన ముందుంటాడు..ఇదేం ఖర్మరా భగవాన్ అంటూ అభిమానులు వెర్రెత్తిపోతున్నారు.
ఆదివారం అహ్మదాబాద్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే ప్రపంచ కప్ 2023 ఫైనల్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఇంగ్లీషు ఆటగాళ్లు రిచర్డ్ కెటిల్‌బరో, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌లను అంపైర్లుగా నియమించింది. కెటిల్‌బరో అంపైరింగ్ లో టీమ్ ఇండియా భారీ నష్టాన్ని చవి చూసింది. దీంతో ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ కు కెటిల్‌బరో అంపైరింగ్ అనగానే భారత్ అభిమానులు ఉస్సురుమంటున్నారు. 2015లో జరిగిన ODI ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌తో సహా నాకౌట్ రౌండ్‌లో మెన్ ఇన్ బ్లూ ఓడిపోయిన అన్ని గత ఐసీసీ ఈవెంట్‌లలో ఉన్న అంపైర్‌లలో అతను ఒకడు. 2015లో జరిగిన ODI ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచకప్ క్లాష్‌లో ఆన్-ఫీల్డ్ అంపైర్‌లలో రిచర్డ్ కెటిల్‌బరో ఒకరని ప్రకటించిన వెంటనే, భారత క్రికెట్ ఔత్సాహికులు సహజంగానే తమ భయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. "హే భగవాన్, ఇతను ఇంకా భారత్ లో ఎందుకు ఉన్నాడు? ఇంగ్లీష్ టీమ్‌తో వెళ్లిపోవాల్సింది కదా?" అని ఓ నెటిజన్ అసహనం వ్యక్తం చేశాడు. "ఫైనల్ కి కెటిల్‌బరో అంపైరింగ్ చేస్తారని తెలిసే దాకా మంచిరోజులే ఉండేవి.. హతవిథీ..’అని మరొకరు చెప్పుకొచ్చాడు.
Icc mens cricket world cup 2023: భారత్, అస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ కు అంపైర్లు వీరే...
"రిచర్డ్ కెటిల్‌బరోను వెంటనే బహిష్కరించండి" అని మూడో యూజర్ సరదాగా రాశారు. "ఐసిసికి రిచర్డ్ కెటిల్‌బరో కంటే మంచి అంపైర్ దొరకడం లేదా? మనల్ని ఏడిపించడంలో ఈయన ముందుంటాడు." అని ఇంకొకరు చెప్పుకొచ్చారు.
"పనోటి" అనే పదం దురదృష్టాన్ని వివరించడానికి ఉపయోగించే పదం.. ఈ పదాన్ని వాడుతూ భారత్ క్రికెట్ అభిమానులు తమ భయాన్ని, ఆందోళనలను వ్యక్తీకరిస్తూ.. మీమ్‌లు, జిఫ్ లను షేర్ చేసింది. 2014 నుండి ICC ఈవెంట్లలో భారత్ అన్ని నాకౌట్ ఓటముల్లో ఉన్న అంపైర్ లలో కెటిల్‌బరో ఒకడు. 2014లో జరిగిన T20 ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు అంపైర్‌గా వ్యవహరించాడు. 2015 ODI సెమీ-ఫైనల్ లో శ్రీలంక చేతిలో భారత్ ఓడిపోయింది. ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిన ప్రపంచకప్, 2016 టీ20 ప్రపంచకప్‌లో భారత్ వెస్టిండీస్ చేతిలో ఓడిన సెమీ ఫైనల్, 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఓడిపోయింది.
ఆదివారం, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రపంచ కప్ పోరులో రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌తో పాటు కెటిల్‌బరో ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా ఉంటారు. గ్రాండ్ ఫినాలే కోసం ఇతర అధికారులలో ట్రినిడాడ్, టొబాగోకు చెందిన జోయెల్ విల్సన్ థర్డ్ అంపైర్, ఫోర్త్ అంపైర్ క్రిస్ గఫానీ (న్యూజిలాండ్), మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ (జింబాబ్వే) ఉన్నారు.