బంగ్లాదేశ్ తో జరిగిన ప్రపంచ కప్ సన్నాహక మ్యాచ్ లో కెఎల్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తక్కువ పరుగులకే ఓపెనర్లిద్దరు వికెట్లు కోల్పోయిన సమయంలో సీనియర్లు కోహ్లీ, ధోని సహకారంతో రాహుల్ ఆ అద్భుతమైన ఇన్నింగ్స్ నెలకొల్పాడు. అయితే టీమిండియా బ్యాటింగ్ లైనప్ లో సమస్యగా మారిన నాలుగో స్థానానికి రాహుల్  ఇన్నింగ్స్ ద్వారా పరిష్కారం లభించినట్లయింది. 

ఈ వార్మప్ మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ... రాహుల్ ఈ స్థానంలో బ్యాటింగ్ కు సరిగ్గా సరిపోయాడని పేర్కొన్నాడు. తర్వాతి మ్యాచుల్లో కూడా అతన్ని ఈ స్థానంలోనే ఆడించనున్నట్లు కోహ్లీ వ్యాఖ్యలనుబట్టి తెలుస్తోంది. ఇలా ప్రపంచ కప్ జట్టులో ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కుతుందా అనుకున్న రాహుల్ కు కోహ్లీ బంఫర్ ఆఫర్ ఇచ్చాడు.   

ఈ ఆఫర్ ను స్వీకరించడానికి రాహుల్ కూడా సిద్దమైనట్లు అతడి మాటల్ని బట్టి తెలుస్తోంది. '' టీమిండియా మేనేజ్ మెంట్ నాపై కొత్త బాధ్యతలు పెట్టింది. నాపై వారికున్న నమ్మకాన్ని వమ్ము చేసుకోవద్దని కసితో ఆడా. దాని ఫలితమే బంగ్లాపై సెంచరీ. నేను ఏ స్థానంలో అయినా ఆడగలనని నిరూపించుకోడానికి మేనేజ్ మెంట్  మంచి అవకాశాన్ని ఇచ్చింది. తాను గిరిగీసుకుని ఇక్కడయితేనే ఆడతాననే రకం కాదని... జట్టు అవసరాన్ని బట్టి ఏ స్థానంలోనైనా బరిలోకి దిగడానికి సిద్దం.'' అని  రాహుల్ పేర్కొన్నాడు. 

ప్రపంచ కప్ మెయిన్ టోర్నీకి ముందు బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వార్మప్ మ్యాచులో భారత్ అదరగొట్టింది. ఓపెనర్లు మరోసారి  విఫలమైనా టాప్ ఆర్డర్ లో కోహ్లీ (46పరుగులు)  పరవాలేదనిపించాడు. ఆ తర్వాత కేఎల్‌ రాహుల్‌ (99 బంతుల్లో 108 పరుగులు), ధోని (78 బంతుల్లో 113 పరుగులు) సెంచరీలతో అదరగొట్టడంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. ఈ  భారీ లక్ష్యాన్ని చేధించడం కోసం బరిలోకి దిగిన బంగ్లా 49.3 ఓవర్లలో 264 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో టీమిండియా  95 పరుగుల తేడాతో గెలుపొందింది.  

మరిన్ని వార్తలు 

నాలుగో స్థానంపై క్లారిటీ ఇచ్చిన కోహ్లీ...పరోక్షంగా అతడికే మద్దతు