ఇంగ్లాండ్ వేదికన వచ్చే నెల  చివర్లో ప్రారంభంకానున్న ప్రపంచ కప్ కోసం అంతా సిద్దమైంది. ఇప్పటికే అన్ని జట్లూ ప్రపంచ కప్ లో పాల్గొనే ఆటగాళ్ల ఎంపికను చేపట్టి ప్రకటించడం కూడా జరిగింది. అలాగే ఈ మెగాటోర్నీకి ఆతిథ్యమిచ్చే మైదానాలు కూడా సకల హంగులతో సిద్దమయ్యాయి. ఇక చివరగా మిగిలిన అంపైర్లు, రిఫరీల ఎంపికను కూడా ఐసిసి పూర్తిచేసింది. మొత్తం 22మంది అంపైర్లు, ఆరుగురు రిఫరీలతో కూడిన జాబితాను ఐసిసి తాజాగా విడుదల చేసింది. 

ఈ అంపైర్ల జాబితాలో భారత్ కు చెందిన సుందరం రవికి చోటు దక్కింది. కర్ణాటకకు చెందిన ఈ అంపైర్ ప్రతిష్టాత్మకమైన ప్రపంచ కప్ లో అంపైరింగ్ చేసే అవకాశాన్ని పొందాడు. భారత అంపైర్లలో ఇతడొక్కడికే ఐసిసి అవకాశం కల్పించింది. 

ఇక గతంలో ప్రపంచ కప్ ఆడిన కొంతమంది ఆటగాళ్లు కూడా తాజాగా అంపైర్లుగా మైదానంలో అడుగుపెట్టబోతున్నారు. శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేన, ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ పాల్ రైఫెల్, ఆసిస్ మాజీ ఆటగాడు డేవిడ్ బూన్ లు వరల్డ్ కప్ మ్యాచులకు అంపైరింగ్ చేయనున్నారు. ఇలా వివిద దేశాలకు చెందిన సీనియర్ అంపైర్లు, రిఫరీలు ప్రపంచ కప్ ప్యానల్లో చోటుదక్కించుకున్నారు. 

ప్రపంచ కప్ కు ఎంపికైన అంపైర్లు వీరే:

అలీం దర్, కుమార్ ధర్మసేన, మారైస్ ఎర్మాస్, క్రిస్ గాఫెన్ని, ఇయాన్ గౌల్డ్, రిచర్డ్ కెట్టిల్‌బోరో, నిగెల్ లాంగ్, బ్రూస్ అక్సెన్‌ఫొర్డ్, సుందరం రవి, పాల్ రైఫెల్, రాడ్ టక్కర్, జొయెల్ విల్సన్, మైఖెల్ డో, రిచిరా పిల్లాయాగెర్లే, పాల్ విల్సన్.
 
మ్యాచ్ రెఫరీలు:

క్రిస్ బోర్డ్, డేవిడ్ బూన్, ఆండి పైక్రాఫ్ట్, జెఫ్ క్రోవ్, రంజన్ మాడుగల్లే, రిచీ రిచర్డ్‌సన్