ఆసియా క‌ప్ : సెమీస్ చేరిన టీమిండియా.. ఒకేఒక్క జ‌ట్టుగా స‌రికొత్త రికార్డు

India Women vs Nepal Women : ఆసియా క‌ప్ లో భాగంగా నేపాల్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 82 పరుగుల తేడాతో విజ‌యం సాధించి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. భార‌త్ తో పాటు పాకిస్తాన్ జ‌ట్టు కూడా సెమీస్ లోకి అడుగుపెట్టింది. 
 

Womens Asia Cup 2024: India storm into semis after thumping win against Nepal, super record RMA

Womens Asia Cup : ఆసియా క‌ప్ 2024 లో భార‌త్ జైత్రయాత్ర కొన‌సాగుతోంది. వ‌రుస విజ‌యాల‌తో రికార్డుల మోత మోగిస్తోంది. మంగ‌ళ‌వారం నేపాల్ తో జ‌రిగిన మ్యాచ్ లో 82 ప‌రుగులు భారీ తేడాతో విజ‌యాన్ని సాధించిన భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు ఐసీసీ టోర్నీలో మ‌రోసారి సెమీ ఫైన‌ల్ కు చేరుకుంది. గ్రూప్ ఏ లో భార‌త్ తో పాటు పాకిస్తాన్ జ‌ట్టు కూడా సెమీస్ కు చేరుకుంది. గ్రూప్ ఏ లో భార‌త్ ఆడిన మూడు మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించి ఆరు పాయింట్ల‌తో తొలి ప్లేస్ లో నిలిచి సెమీస్ కు క్వాలిఫై అయింది. పాకిస్తాన్ రెండు మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించి ఇదే గ్రూప్ నుంచి 4 పాయింట్ల‌తో సెమీస్ చేరుకుంది. అత్య‌ధిక సార్లు సెమీస్ చేరిన జ‌ట్టుగా భార‌త రికార్డు సాధించింది. 

బ్యాటింగ్, బౌలింగ్ లో అద‌ర‌గొట్టిన భార‌త్.. 

2024 మహిళల ఆసియా కప్‌లో మంగళవారం దంబుల్లా వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో 82 పరుగుల తేడాతో నేపాల్‌ను ఓడించి భారత్ సెమీ ఫైనల్‌కు చేరుకుంది. భారత్‌తో పాటు పాకిస్థాన్‌ కూడా రెండో రౌండ్‌కు బెర్త్‌ను ఖాయం చేసుకుంది. నేపాల్ 10 ఓవర్లలో 179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో భార‌త బౌలింగ్ ముందు నిలువ లేక‌పోయింది. 20 ఓవ‌ర్ల‌లో 96/9 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. ఈ మ్యాచ్ లో భారత్ తమ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు విశ్రాంతినిచ్చింది. పూజా వస్త్రాకర్ కూడా విశ్రాంతిలో ఉన్నారు. దీంతో స్మృతి మంధాన కెప్టెన్ గా జ‌ట్టును న‌డిపించారు.

గుజరాత్‌ టైటాన్స్ పై కన్నేసిన అదానీ.. పోటీలో మరో గ్రూప్.. అన్ని వేల కోట్లా? 

తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ 178-3 ప‌రుగులు చేసింది. 48 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ తో 81 పరుగుల సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడింది ఓపెన‌ర్ షఫాలీ వర్మ. కేవ‌లం 26 బంతుల్లో అర్ధసెంచరీ చేసింది. మ‌రో ఓపెన‌ర్ హేమ‌ల‌త 47 ప‌రుగుల ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్ద‌రూ కలిసి ఓపెనింగ్ వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. జెమిమా రోడ్రిగ్స్ 15 బంతుల్లో 28 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. నేపాల్ బౌల‌ర్ల‌లో సీతా రాణా మగర్ 2 వికెట్లు తీసుకున్నారు. 

179 ప‌రుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన నేపాల్ జ‌ట్టుకు ఏ స‌మ‌యంలోనూ భార‌త్ ఛాన్స్ ఇవ్వ‌లేదు. మొద‌టి నుంచి మ్యాచ్ ను త‌మ వైపునే ఉంచుకుంది. వ‌రుస‌గా వికెట్లు తీసుకుంటూ నేపాల్ ను ప‌రుగులు చేయ‌కుండా అడ్డుకుంది భార‌త్. దీప్తి శర్మ మరోసారి అద్బుతమైన బౌలింగ్ తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. దీప్తి 4 ఓవర్ల తన బౌలింగ్ లో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకుంది. దీప్తికి తోడుగా రేణుకా ఠాకూర్ సింగ్ 1 వికెట్, అరుంధతి రెడ్డి 2 వికెట్లు, రాధా యాదవ్ 2 వికెట్లు తీసుకున్నాడు. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన షఫాలీ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది.

 

 

 

రవీంద్ర జడేజా క్రికెట్ కెరీర్ ముగిసిందా?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios