Asianet News TeluguAsianet News Telugu

కోహ్లీ అసలు మనిషే కాదు: విండిస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా

ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. భారత జట్టు ప్రస్తుత ఫామ్ ను వరల్డ్ కప్ లోనూ కొనసాగిస్తే గెలుపు ఖాయమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.బలమైన భారత బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ విభాగాన్ని చూస్తేనే ఈ విషయాన్ని చెప్పవచ్చని మాజీలు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మెగా టోర్నీలో విరాట్ కోహ్లీ కీలకం కానున్నాడని వారు అభిప్రాయపడుతున్నారు. 
 
windies legendary cricketer brian lara praises virat kohli
Author
Hyderabad, First Published May 24, 2019, 4:34 PM IST

ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. భారత జట్టు ప్రస్తుత ఫామ్ ను వరల్డ్ కప్ లోనూ కొనసాగిస్తే గెలుపు ఖాయమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.బలమైన భారత బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ విభాగాన్ని చూస్తేనే ఈ విషయాన్ని చెప్పవచ్చని మాజీలు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మెగా టోర్నీలో విరాట్ కోహ్లీ కీలకం కానున్నాడని వారు అభిప్రాయపడుతున్నారు. 

కెప్టెన్ గానే కాకుండా బ్యాట్ మెన్ గా కూడా కోహ్లీ రాణించగలడని...ఈ మెగా టోర్నీలోనే అతడు తన 11వేల  వన్డే పరుగుల మైలురాయిని సాధించడంతో పాటు మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకోనున్నట్లు మాజీలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలా కేవలం టీమిండియా మాజీలే కాకుండా విదేశీ దిగ్గజాలు కూడా కోహ్లీ ఆటతీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా విండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా కూడా తాజాగా కోహ్లీ ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ ఆటగాడంటూ కొనియాడారు. 

''విరాట్ కోహ్లీ ఓ మిషన్. అతడి ఆటతీరు చాలా డిఫరెంట్ గా వుంటుంది. ఆటగాళ్లకు ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. ఒకప్పటి ఆటగాళ్ల కంటే ఇప్పటి క్రికెటర్లకు ఇది చాలా ముఖ్యం.ఫిజికల్ గానే  కాకుండా మెంటల్ గా ఫిట్ గా వున్నపుడే ఆటగాళ్లు రాణించగలరు. తన ఫిట్ నెస్ ను కాపాడుకోడానికి కోహ్లీ ఎక్కువగా కష్టపడతాడు. కాబట్టే అతడు అందరిలాగా కేవలం మనిషిగా కాకుండా...రన్ మిషన్ గా మారాడు.

జట్టుకు ఎప్పుడు అవసరం వచ్చినా తన బ్యాటింగ్ ఆదుకోడానికి కోహ్లీ ముందుటాడు. సచిన్ టెండూల్కర్ ఎంత గొప్ప ఆటగాడో కోహ్లీ కూడా అలాంటివాడే. అందివచ్చిన అవకాశాలను  వాడుకుని తన అద్భుత ప్రతిభతో టెండూల్కర్ ఎంతో గౌరవంగా క్రికెట్ కు వీడ్కోలు పలికారు. అలాంటి గౌరవాన్నే కోహ్లీ కూడా పొందుతాడు. ఇంకా  చెప్పాలంటే టెండూల్కర్ కంటే ఎక్కువ టాలెంట్ ను కోహ్లీ కలిగివున్నాడు. ఇప్పటి  యువ క్రికెటర్లకు అతడు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు'' అంటూ కోహ్లీని లారా ఆకాశానికెత్తాడు.

 ప్రపంచ కప్ వార్తలు  

2019 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. జూన్ 16న పాక్‌తో భారత్ ఢీ

Follow Us:
Download App:
  • android
  • ios