టీమిండియా-వెస్టిండిస్ ల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో వెస్టిండిస్ హిట్టర్ కిరన్ పొలార్డు అతిగా ప్రవర్తించాడు. మైదానంలోని అంపైర్లు మాటను దిక్కరించి మరీ మైదానాన్ని వీడిన అతడిపై ఐసిసి చర్యలు తీసుకుంది. పొలార్డ్ మ్యాచ్ ఫీజులో 20శాతం కోత విధించడంతో పాటు అతడి  ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ ను చేర్చారు.

ప్లోరిడా వేదికన ఆదివారం జరిగిన రెండో టీ20 లో టీమిండియా-వెస్టిడిస్ లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ  మ్యాచ్ లోనే పొలార్డ్ ఐసిసి నిబంధనలను అతిక్రమించాడు. టీమిండియా మొదటు బ్యాటింగ్ కు దిగగా విండీస్ ఆటగాళ్లందరితో కలిసి పొలార్డ్ కూడా మైదానంలో అడుగుపెట్టాడు. అయితే కొద్దిసేపటి తర్వాత అతడు తన స్ధానంలో సబ్‌స్టిట్యూట్  తో ఫీల్డింగ్ చేయించాడు. ఈ విషయంలోనే అతడు అంపైర్ల నిర్ణయాన్ని దిక్కరించాడు.   

అంపైర్లు అనుమతించకున్నా అతడు పదే పదే  సబ్‌స్టిట్యూట్ తో ఫీల్డింగ్ చేయించాడు. దీంతో అతడి వ్యవహారాన్ని తప్పుబడుతూ అంపైర్లు మ్యాచ్ రెఫరీ జెఫ్ క్రో కు ఫిర్యాదు చేశారు. దీంతో అతడు విచారణ జరిపి ఈ నిర్ణయం తీసుకున్నాడు. 

అంపైర్ల ఫిర్యాదుపై పొలార్డ్ తో మాట్లాడాను. అయితే అతడు తప్పు చేసినట్లు అంగీరకరించాడు. దీంతో ఐసీసీ ఆర్టికల్‌ 2.4 నియమావళికి ఉళ్లంఘించినట్లు నిర్దారించుకుని అతడిపై చర్యలు తీసుకున్నాం. పొలార్డ్ ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ తో పాటు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించాము.'' అని రిఫరీ జెఫ్ క్రో  వెల్లడించారు.  

ఈ రెండో టీ20 మ్యాచ్ కు వరుణుడు అంతరాయం కలిగించడంతో డక్ వర్త్ లూయిస్ పద్దతిన టీమిండియా విజేతగా నిలిచింది. మొదట  బ్యాటింగ్ కు దిగిన భారత్ 168 పరుగుల లక్ష్యాన్ని విండీస్ ముందు వుంచింది. అయితే ఆ జట్టు 15.4  ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 94 పరుగుల వద్ద వుండగా వర్షం అంతరాయం కలిగించింది. దీంతో డీఎల్ఎస్ పద్దతిన 22  పరుగుల తేడాతో విజయం సాధించింది.