టీమిండియాతో జరగనున్న టీ20 సీరిస్ ఆరంభానికి ముందే విండీస్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ టీ20 సీరిస్ మొత్తానికి దూరమయ్యాడు. గాయం కారణంగా ఫిట్ నెస్ సాధించలేకపోవడంతో అతన్ని జట్టు నుండి తప్పించినట్లు విండీస్ బోర్డు ప్రకటించింది. రస్సెల్ స్థానంలో  జేసన్ మహ్మద్ ను భారత్ తో జరిగే టీ20 సీరిస్ కోసం ఎంపికచేశారు. 

ఇలా ఇవాళ(శనివారం) యూఎస్ఏ లో జరగనున్న టీ20 మ్యాచ్ కు రస్సెల్ దూరమయ్యాడు. ఇప్పటికే క్రిస్ గేల్ వంటి విధ్వంసకర ఆటగాడు ఈ సీరిస్ కు దూరమవగా తాజాగా రస్సెల్ కూడా గాయంతో వైదొలగడం విండీస్ కు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. 

మూడు టీ20ల సీరిస్ లో భాగంగా మొదటి రెండు వన్డేలు ప్లోరిడాలో జరగనున్నాయి.  ఇక మూడో టీ20  గయానాలో జరగనుంది. ఇందుకోస ఇప్పటికే ఇరుజట్లు యూఎస్ఎ కు చేరుకున్నాయి. భారత కాలమానం ప్రకారం మొదటి టీ20 ఇవాళ రాత్రి 8గంటలకు ప్రారంభంకానుంది.

ఈ టీ20 సీరిస్ లో భారత్ తో పాటు వెస్టిండిస్ జట్టు కూడా యువ ఆటగాళ్లను పరీక్షిస్తోంది. ఖారీ ఫెర్రీ, పూరన్, బ్రాంబెల్ వంటి యువకులను ఈ సీరిస్ కోసం ఎంపికచేసింది. ఇక భారత జట్టు కూడా రాహుల్ చాహర్, నవదీప్ సైనీ, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే వంటి యువ ఆటగాళ్లను ఈ సీరిస్ లో బరిలోకి దించుతోంది. ఇలా యువ రక్తంతో ఉరకలెత్తుతున్న ఇరు జట్లు  గెలుపే లక్ష్యంగా పోరాడనున్నాయి. ఇందులో ఎవరిది పైచేయిగా నిలుస్తుందో చూడాలి మరి.  

సంబంధిత వార్తలు

యూఎస్ఎ కు చేరుకున్న కోహ్లీసేన... వెస్టిండిస్ పర్యటన షెడ్యూల్ ఇదే

ఆ నలుగురిని ఎదుర్కోవడం టీమిండియాకు కష్టమే: విండీస్ కోచ్

టీ20 సీరిస్ కోసం విండీస్ జట్టు ఎంపిక.... టీమిండియాకు గుడ్ న్యూస్