ప్రపంచ కప్ తర్వాత టీమిండియా మొదటి మ్యాచ్ వెస్టిండిస్ తో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ లకు భారతో...వెస్టిండిసో ఆతిథ్యమిస్తుందని మీరు పొరపడినట్లే. విచిత్రంగా టీమిండియా-వెస్టిండిస్ ల మధ్య జరిగే ఈ సిరీస్ వివిధ దేశాల్లో సాగనుంది. అలా మొదట యూఎస్ ఈ నెల 3వ తేదీ నుండి జరగనున్న టీ20 సీరిస్ కోసం కోహ్లీసేన ఇప్పటికే యూఎస్ఎ కు చేరుకుంది. 

ఆగస్ట్ 3నుండి 6వ తేదీ వరకు టీమిండియా ప్లోరిడాలో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. ఆ తర్వాత  8వ తేదీ నుండి 3 వన్డేల సీరిస్ జరుగుతుంది. ఇక ఆగస్ట్ 22  నుండి ఐసిసి టెస్ట్ చాంపియన్ షిప్ లో భాగంగా ఇరు దేశాల మధ్య 2 టెస్టు మ్యాచ్ లు జరగనున్నాయి. 

వివిధ దేశాల్లో సాగనున్న భారత పర్యటన షెడ్యూల్:

ఆగస్ట్ 3వ తేదీ - మొదటి టీ20 - ప్లోరిడా

ఆగస్ట్ 4వ తేదీ - రెండో టీ20 - ప్లోరిడా

ఆగస్ట్ 6వ తేదీ - మూడో టీ20 - గయానా

ఆగస్ట్ 8వ తేదీ - మొదటి వన్డే - గయానా

ఆగస్ట్ 11వ తేదీ - సెకండ్ వన్డే - ట్రినిడాడ్

ఆగస్ట్ 14వ తేదీ - మూడో వన్డే - ట్రినిడాడ్
 
ఆగస్ట్ 22-26 - ఫస్ట్ టెస్ట్ - ఆంటిగ్వా 

ఆగస్ట్ 30-సెప్టెంబర్ 3వ తేదీ - సెకండ్ టెస్ట్ - జమైకా