రిషబ్ పంత్ టీ20 ప్రపంచకప్ ఆడతాడా? భారత జట్టును ఎప్పుడు ప్రకటిస్తారు?
Rishabh Pant, T20 World Cup Squad: ఐపీఎల్ 2024లో ఉత్కంఠభరితమైన మ్యాచ్ ల నడుమ టీ20 వరల్డ్ కప్ 2024 గురించి పెద్ద వార్తే వస్తోంది. ఈ టోర్నమెంట్ కోసం భారత జట్టును త్వరలో ప్రకటించనున్నారు. ఇందులో స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ కు చోటుదక్కనుందని సమాచారం.
Rishabh Pant, T20 World Cup Squad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో క్రికెట్ అభిమానులు ప్రస్తుతం ఉత్కంఠభరితమైన మ్యాచ్ లను ఆస్వాదిస్తున్నారు. థ్రిల్లింగ్ మ్యాచ్ లు, ధనాధన్ ఇన్నింగ్స్ లతో క్రికెట్ లవర్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలోనే టీ20 వరల్డ్ కప్ 2024 హంగామా కూడా మోదలైంది. టీమిండియాకు సంబంధించి మరో బిగ్ క్రేజీ న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఈ మెగా టోర్నమెంట్ కోసం భారత జట్టును త్వరలో ప్రకటించనున్నారు. ఇందులో స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ కు కూడా చోటుదక్కనుందని సమాచారం.
డిసెంబర్ 30, 2022 రాత్రి రిషబ్ పంత్ ఘోర కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్ చాలా కాలం క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. మళ్లీ ఐపీఎల్ 2024తో క్రికెట్ గ్రౌండ్ లోకి దిగాడు. ప్రారంభంలో కాస్త ఇబ్బంది పడినా.. ఆ తర్వాత మ్యాచ్ నుంచి మంచి ఆటతీరును కనబరుస్తున్నాడు. ఇప్పుడు పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్ లో వికెట్ కీపింగ్లో కూడా పంత్ మెరుగ్గా రాణిస్తున్నాడు కాబట్టి బ్యాటింగ్ లో కూడా లయలోకి వస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పంత్ వరుసగా రెండు అర్ధసెంచరీలు సాధించాడు. దీంతో ఈ స్టార్ ప్లేయర్ టీ20 వరల్డ్ కప్ 2024 తో మళ్లీ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశముంది.
పంత్ సహా పలువురు ఆటగాళ్లపై కన్నేసిన బీసీసీఐ..
ఇప్పటికే పలువురు ప్లేయర్లు టీ20 ప్రపంచ కప్ 2024 భారత జట్టులో వుండబోయే లిస్టులో ఉన్నారు. అయితే, మెగా టోర్నీని దృష్టింలో ఉంచుకుని పలువురు యంగ్ ప్లేయర్లపై బీసీసీఐ కన్నేసి ఉంచింది. అయితే, రిషబ్ పంత్ కుటీ20 ప్రపంచకప్ 2024 భారత కు జట్టులోకి ఎంపిక చేయవచ్చని పలు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. అలాగే, క్రికెట్ వర్గాల్లో కూడా ఇదే చర్చ సాగుతోంది. పంత్ తో పాటు పలువురు ఆటగాళ్లు బీసీసీఐ సెలెక్టర్ల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం.
ఈ నెలాఖరున బీసీసీఐ సమావేశం..
రిషబ్ పంత్ తన ఫామ్ ను చూపిస్తున్నాడనీ, అతను ఎంత ఫిట్ గా ఉన్నాడో చూపిస్తున్నాడనీ, అయితే ప్రస్తుతం అతను బాగానే ఉన్నాడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని చాలా మంది ఆటగాళ్లు సెలక్టర్లు దృష్టిసారించిన వారిలో పంత్ కూడా ఒకడని తెలిపాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ 2024 జూన్ లో అమెరికా, వెస్టిండీస్ లో జరగనున్న సంగతి తెలిసిందే.
టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు. ఈ టోర్నమెంట్ కోసం భారత జట్టును ఈ నెలాఖరులో ప్రకటించనున్నారు. ఈ నెల చివరి తేదీ అంటే ఏప్రిల్ 30న లేదా మే మొదటి రోజున సెలెక్టర్ల సమావేశం నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ఆ తర్వాత ప్రపంచకప్ కు భారత జట్టును ప్రకటిస్తారు.
స్టార్లు ఉన్నా సత్తాచాటలేకపోతున్నారు.. బెంగళూరుకు ఏమైంది? కోహ్లీ ఒక్కడైతే సరిపోతుందా..?