Asianet News TeluguAsianet News Telugu

MS Dhoni: 2023 ఐపీఎల్ లో ధోని ఆడతాడా..? ఆ కామెంట్స్ కు అర్థమేమిటి..?

TATA IPL 2022: ఐపీఎల్ ప్రారంభ సీజన్ (2008) నుంచి  2022 వరకు చెన్నై సూపర్ కింగ్స్ కు సారథ్యం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోని తర్వాత సీజన్ లో ఆడతాడా..? ఆదివారం ధోని చేసిన కామెంట్స్ కు అర్థమేమిటి..? 

Will Ms Dhoni Play IPL 2023, CSK Skipper Says This
Author
India, First Published May 2, 2022, 1:31 PM IST | Last Updated May 2, 2022, 1:31 PM IST

ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్లుగా ఉన్న  చెన్నై సూపర్ కింగ్స్ ను  అంతే విజయవంతంగా నడపడంలో ధోని పాత్ర ఎనలేనిది.  నాలుగు సార్లు ఛాంపియన్ అయిన సీఎస్కే.. ఈసారి చెత్త ప్రదర్శనలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. అయితే రవీంద్ర జడేజా నుంచి సారథ్య బాధ్యతలు తిరిగి తీసుకున్న ధోని.. ఆదివారం  హైదరాబాద్ తో ముగసిన మ్యాచ్ లో మళ్లీ చెన్నైని విజయాల బాట పట్టించాడు. అయితే మ్యాచ్ సందర్భంగా టాస్ సమయంలో ధోని  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ఆ వ్యాఖ్యల సారాంశమేమిటి..? ధోనికి ఇదే ఆఖరు సీజన్ అనుకుంటున్న తరుణంలో  అతడు మళ్లీ 2023 లో కూడా ఆడతాడా..? ఇప్పుడిదే హాట్ టాపిక్. 

సన్ రైజర్స్ తో మ్యాచ్ సందర్బంగా  టాస్ వేసే సమయంలో ధోని టాస్ ఓడి కేన్ విలియమ్సన్ తర్వాత మాట్లాడాడు. ధోని మైక్ అందుకోగానే  స్టేడియం అరుపులు, కేకలతో దద్దరిల్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మ్యాచ్ ప్రెజెంటర్ డానీ మోరిసన్ కూడా కాసేపు ఏం మాట్లాడలేకపోయాడు. కొన్ని క్షణాల తర్వాత   అతడు ధోనిని ఓ ప్రశ్న అడిగాడు. 

‘మిమ్మల్ని ఇక్కడ చూడటం చాలా బాగుంది. మీ భవిష్యత్తు ఏంటి..? మిమ్మల్ని మళ్లీ ఈ జెర్సీ లో చూడొచ్చా..’ అని మోరిసన్ ప్రశ్నించాడు. దీనికి ధోని సమాధానం చెబుతూ... ‘గతేడాది కూడా నన్ను ఇదే ప్రశ్న అడిగారు. అప్పుడు కూడా నేను మీరు నన్ను ఎల్లో జెర్సీ లో చూస్తారని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. అయితే అది ఈ జెర్సీనా లేక మరేదైనా ఎల్లో జెర్సీనా..? అనేది  మీకు త్వరలోనే తెలుస్తుంది..’ అని అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

 

అయితే  గత సీజన్ లో ట్రోఫీ నెగ్గిన తర్వాతే ధోని  రిటైర్మెంట్ ప్రకటిస్తాడనుకుంటే  అతడు మాత్రం తన ఆటను కొనసాగిస్తూ ఈ  ఐపీఎల్ లో కూడా ఆడుతున్నాడు. ఈ సీజన్ కు  కొద్దిరోజుల ముందు కెప్టెన్సీ నుంచి వైదొలిగి.. ఆ బాధ్యతలను రవీంద్ర జడేజాకు అప్పజెప్పాడు ధోని. కానీ వరుస పరాజయాలు, యాజమాన్యం నుంచి ఒత్తిళ్లతో జడేజా ఆ పగ్గాలను జడ్డూ తిరిగి ధోనికే అప్పజెప్పాడు. 

తిరిగి కెప్టెన్సీ స్థానంలోకి వచ్చిన ధోని.. వచ్చే ఏడాది కూడా  తనను ఎల్లో జెర్సీలో చూస్తారని చెప్పడాన్ని బట్టి..  అతడు  చెన్నైని ఇప్పట్లో వీడడని   స్పష్టం చేశాడు. ఇప్పటికే ధోని వయసు 40 ఏండ్లు దాటింది. ఈ సీజన్ లోనే ధోని  రిటైర్మెంట్ ప్రకటించే  అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  అయితే ధోని మాటలను బట్టి చూస్తే వచ్చే ఏడాది చెన్నైకి మెంటార్ గానో లేక హెడ్ కోచ్ గానో వచ్చే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. ధోని వ్యాఖ్యల్లో కూడా అర్థమదే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. అయినా ఏ విషయంలో కూడా అంత త్వరగా బయటపడని ధోని.. మరి ఏ షాకులు ఇస్తాడో చూడాలి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios