టీమిండియాకు కొత్త కెప్టెన్ ఎవ‌రు?

Team, India : టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ట్రోఫీ గెలిచిన త‌ర్వాత కెప్టెన్ గా ఉన్న రోహిత్ శ‌ర్మ ఈ ఫార్మాట్ కు వీడ్కోలు ప‌లికాడు. అలాగే, హెడ్ కోచ్ గా రాహుల్ ద్ర‌విడ్ స్థానంలో గౌత‌మ్ గంభీర్ వ‌చ్చారు. ఇప్పుడు కొత్త కెప్టెన్ జ‌ట్టును ముందుకు న‌డిపించ‌నున్నాడు. 
 

Who is the new captain of the Indian team? Hardik Pandya, KL Rahul, Suryakumar Yadav, Rishabh Pant RMA

Team, India : టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 గెలిచిన త‌ర్వాత భార‌త క్రికెట్ జ‌ట్టు విచిత్ర‌మైన ప‌రిస్థితి ఎదుర్కొంటోంది. ఎంతో మంది స్టార్ ప్లేయ‌ర్లు ఉన్న భార‌త జ‌ట్టుకు ఇప్పుడు కెప్టెన్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విచిత్రంగా అనిపించినా ఇదే వాస్త‌వం.. ! టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 గెలిచిన త‌ర్వాత పొట్టి ఫార్మ‌ట్ కు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ వీడ్కోలు ప‌లికాడు. దీంతో జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌ను భార‌త జ‌ట్టు శుభ్ మ‌న్ గిల్ తాత్కాలిక కెప్టెన్సీలో పూర్తిచేసుకుని వ‌చ్చింది. అయితే, దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) ఇప్పుడు కొత్త కెప్టెన్ ను ప్ర‌క‌టించ‌నుంది. 

క్రికెట్ వ‌ర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. భార‌త జ‌ట్టు తదుపరి టీ20 కెప్టెన్ పేరును బీసీసీఐ ఇప్ప‌టికే దాదాపు ఖరారు చేసింది. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌లో కెప్టెన్‌గా కనిపించనున్న ఆటగాడే టీ20 ప్రపంచకప్ 2026 వరకు టీ20 ఫార్మాట్‌లో భార‌త జ‌ట్టును ముందుకు న‌డిపించ‌నున్నాడు. వైస్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా కెప్టెన్ చేస్తార‌నే రిపోర్టుల మ‌ధ్య‌.. అనూహ్యంగా కొత్త కెప్టెన్ గా ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడే సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 జట్టుకు రెగ్యులర్ కెప్టెన్‌గా చేయవచ్చని టాక్ వినిపిస్తోంది. భారత టీ20 కెప్టెన్ రేసులో సూర్య కుమార్ యాద‌వ్ వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాతో పాటు జింబాబ్వేతో సిరీస్ ను గెలుచుకువ‌చ్చిన తాత్కాలిక కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ ను వెన‌క్కినెట్టి రేసులో ముందుకొచ్చాడు. ఇదే స‌మ‌యంలో రిష‌బ్ పంత్ పేరుకూడా వినిపిస్తోంది. 

రోహిత్, విరాట్ కోసం గౌతమ్ గంభీర్ కోరిక.. !

రోహిత్ శ‌ర్మ‌కు విశ్రాంతి, హార్దిక్ పాండ్యా గాయం కార‌ణంగా గతేడాది ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన 8 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అప్పటి నుండి, సూర్యకుమార్ యాదవ్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ మొదటి ఎంపికగా మారారు. అలాగే, కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా సూర్యకే ఓటు వేస్తున్నార‌ని స‌మాచారం. ప‌లు మీడియా రిపోర్టులు ప్ర‌కారం.. ఇదే విష‌యం గురించి గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ లు  చ‌ర్చ‌లు జ‌రిపారు. అలాగే, హార్దిక్ పాండ్యాతో కూడా చ‌ర్చించార‌ని తెలుస్తోంది. 

ఇటీవ‌ల ముగిసిన ఐసీసీ టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 త‌ర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు ప‌లికాడు. దీంతో కొత్త కెప్టెన్ కోసం అన్వేషణ కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే చాలా మంది పేర్లు తెర‌మీద‌కు వచ్చాయి. అందులో ప్ర‌ధానంగా వినిపించిన పేరు హార్దిక్ పాండ్యా. కానీ, అతని గాయాలు ఈ రేసులో వెనక్కినెట్టాయి. సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా బోర్డు పరిశీలిస్తోంది. అదే సమయంలో హార్దిక్ పాండ్యా వ్యక్తిగత కారణాల వల్ల శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ ఆడేందుకు నిరాక‌రించాడ‌ని స‌మాచారం. అంతకు ముందు జరిగే టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉండ‌నున్నాడు. 

టెస్టు క్రికెట్ లో అత్య‌ధిక వికెట్లు తీసిన టాప్-5 బౌల‌ర్లు వీరే

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios