టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మపై మాజీ ఆటగాడు, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేశాడు. రోహిత్ ఓపెనర్‌గా ఈ స్థాయిలో ఉన్నాడంటే అదంతా ధోనీ వల్లనేనని పేర్కొన్నాడు.

ఆదివారం స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన  ఓ ఇంటర్వ్యూలో గంభీర్ మాట్లాడుతూ.. 2007లోనే రోహిత్ శర్మ తన కెరీర్‌ను ప్రారంభించినా.. ఒక రకంగా అతని కెరీర్‌ ఊపందుకున్నది మాత్రం 2013 నుంచే అని చెప్పాడు.

Also Read:మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: మహమ్మద్ షమీ

ఎందుకంటే జట్టులోకి వచ్చిన తొలి నాళ్లలో హిట్‌మ్యాన్ ‌విఫలమైనా అప్పటి టీమిండియా కెప్టెన్‌ ధోనీ అండగా నిలబడ్డాడని పేర్కొన్నాడు. రోహిత్‌ను ఓపెనర్‌గా పంపాలని ధోనీ 2013లో నిర్ణయం తీసుకున్నాడని.. నాటి నుంచి రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నాడని గంభీర్ గుర్తుచేశాడు.

ఏకంగా వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలను సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడని గౌతమ్ ప్రశంసించాడు. సెలెక్షన్ కమిటీ, జట్టు మేనేజ్‌మెంట్ గురించి మాట్లాడొచ్చని కానీ కెప్టెన్ మద్ధతు లేకపోతే అవన్నీ నిరుపయోగమే.. ఎందుకంటే అంతా సారథి చేతుల్లోనే ఉంటుందని గంభీర్ తెలిపాడు.

Also Read:కెరీర్ కి ముగింపు పలకాలని అనుకుంటున్నా.. మిథాలీ రాజ్

ఈ విషయంలో మాత్రం రోహిత్ శర్మకు ధోనీ చాలా కాలం మద్ధతుగా నిలిచాడు. తనకు తెలిసి అంత సపోర్ట్ మరే ఆటగాడు పొందలేదని గౌతమ్ గుర్తుచేశాడు. ప్రస్తుతం టీమిండియాలోని యువ ఆటగాళ్లకు కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అండగా నిలవాల్సిన అవసరం ఉందని గంభీర్ చెప్పాడు.