Asianet News TeluguAsianet News Telugu

గిల్ డబుల్ సెంచరీ.. వాడింకెప్పుడు నేర్చుకుంటాడంటూ తండ్రి అసహనం..

Shubman Gill: టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ బుధవారం ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్ తో  ముగిసిన  తొలి వన్డేలో డబుల్ సెంచరీ సాధించి రికార్డులు బద్దలుకొట్టిన విషయం తెలిసిందే.  

When will he learn?: Shubman Gill's Father was not Happy with his Century Against Sri Lanka  MSV
Author
First Published Jan 19, 2023, 2:49 PM IST

ఏడాది కాలంగా  వన్డేలలో నిలకడగా రాణిస్తున్న  టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు.  ఇటీవలే శ్రీలంకతో ముగిసిన వన్డే సిరీస్ లో   మెరుగ్గా రాణించి  రోహిత్ శర్మతో  ఓపెనింగ్ స్థానానికి తన ప్లేస్ ను ఖాయం చేసుకున్న   గిల్.. తాజాగా  న్యూజిలాండ్ తో తొలి వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఉప్పల్ వన్డేలో  గిల్.. డబుల్ సెంచరీ బాది జట్టులో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. అయితే కొడుకు ఇంత  సూపర్ ఫామ్ లో ఉన్నా గిల్ తండ్రి మాత్రం సంతృప్తిగా లేడట.. 

ఈ విషయాన్ని భారత మాజీ క్రికెటర్ గురుక్రీత్ మన్  చెప్పాడు. గిల్ డబుల్ సెంచరీ తర్వాత అతడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గిల్ లంకతో మూడో వన్డేలో సెంచరీ చేసిన తర్వాత.. అతడి తండ్రి లక్వీందర్ మన్ అసహనం వ్యక్తం చేశాడని గురుక్రీత్ తెలిపాడు. 

గురుక్రీత్ మాట్లాడుతూ..‘‘లంకతో చివరి వన్డే సందర్భంగా నేను గిల్ వాళ్ల ఇంట్లోనే ఉన్నా.   అతడి సెంచరీ పూర్తయ్యాక   116 పరుగులకు ఔటయ్యాడు. అప్పుడు గిల్ తండ్రి.. ‘అదిగో చూడు ఎలా ఔటయ్యాడో..  గిల్ కు డబుల్ సెంచరీ చేయడానికి ఆస్కారం ఉంది. అయినా  ఇలా చెత్త షాట్ ఆడి ఔట్ అయ్యాడేంటి..? ఇటువంటి  ఆరంభాలు  మళ్లీ దొరుకుతాయా..?  వాడు ఇంకెప్పుడు నేర్చుకుంటాడు..?’ అని అసహనం వ్యక్తం చేశాడు..’అని  చెప్పాడు. 

లంకతో చివరి వన్డేలో గిల్..  87 బంతుల్లోనే  సెంచరీ చేశాడు. అతడు ఔట్ అయ్యేసరికి  ఇంకా 14 ఓవర్లు మిగిలేఉన్నాయి.   నిన్నటి మ్యాచ్ లో మాదిరిగా కొద్దిసేపు క్రీజులో ఉండుంటే  గిల్ మరో సెంచరీ చేసేవాడని  లఖ్విందర్ భావన అని గురుక్రీత్ తెలిపాడు. అయితే  తర్వాత వన్డేలో  ద్విశతకం చేయడం ద్వారా లఖ్విందర్ ఫుల్ హ్యాపీ అయ్యాడని గురుక్రీత్ తెలిపాడు.  

‘లఖ్విందర్ పాజీ  ఇప్పుడు  ఫుల్ హ్యాపీగా ఉండుంటాడు. ఆయనకు కొడుకు మీద  చాలా ఆశలున్నాయి.  అతడు ఎప్పుడూ మంచి ప్రదర్శనలు  చేయాలని  లఖ్విందర్ కోరుకుంటాడు. నేడు గిల్ సాధించిన  దానితో  ఆయన చాలా సంతోషపడుంటాడు..’ అని  చెప్పాడు. 

 

ఇక నిన్నటి మ్యాచ్ లో  డబుల్ సెంచరీ చేయడం ద్వారా గిల్ పలు రికార్డులు బద్దలుకొట్టాడు.  భారత్ తరఫున వన్డేలలో ఇది ఏడో డబుల్ హండ్రెడ్. అంతకుముందు రోహిత్ శర్మ (3), సచిన్, సెహ్వాగ్, ఇషాన్ కిషన్ లు తలా ఓ డబుల్ హండ్రెడ్ సాధించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios