తన ఆఫ్ స్పిన్ తో ప్రత్యర్థులను మస్కా కొట్టించే పాక్ మాజీ క్రికెటర్ సక్లైన్ మస్తాక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రికెట్ అభిమాలను ఆయన సుపరిచితుడే. కాగా.. ఆయన తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా సంభాషిస్తూ ఉంటారు. తాజాగా.. 1999లో ఇంగ్లాండ్ లో జరిగిన ప్రపంచ కప్ కి సంబంధించిన ఓ సరదా సంఘటనను ముస్తాక్ తాజాగా వివరించారు.

1999 ప్రపంచకప్‌ సమయంలో హోటల్‌ రూమ్‌లోని కబోర్డ్‌లో తన భార్యను దాచేసే వాడినని పాకిస్థాన్‌ మాజీ స్పిన్నర్‌ సైక్లెన్‌ ముస్తాక్‌ వెల్లడించాడు. కుటుంబానికి దూరంగా ఉండాలని టోర్నీ మధ్యలో జట్టు మేనేజ్‌మెంట్‌ నిబంధన విధించినా.. ఎవరికీ కనిపించకుండా భార్యను రూమ్‌లోనే ఉంచానని ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. 

‘నాకు 1998 డిసెంబర్‌లో వివాహమైంది. 1999 ప్రపంచకప్‌ కోసం లండన్‌కు భార్యతోనే వెళ్లా. అయితే టోర్నీ మధ్యలో కుటుంబాలను ఆటగాళ్లు ఇండ్లకు పంపాలని మేనేజ్‌మెంట్‌ ఆదేశించింది. అయితే అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు ఈ నిబంధన ఎందుకని అడిగినా పట్టించుకోలేదు. అందుకే ఆ నిబంధన పాటించకూడదని అనుకున్నా. భార్యను గదిలోనే ఉంచుకున్నా. జట్టు మేనేజర్‌, కోచ్‌ తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు నా భార్యను కబోర్డ్‌లో దాచిపెట్టేవాడిని’ అని ముస్తాక్‌ చెప్పాడు. 1999 ప్రపంచకప్‌లో ఫైనల్‌ చేరిన పాకిస్థాన్‌.. ఆస్ట్రేలియా చేతిలో ఓడింది.