Asianet News TeluguAsianet News Telugu

35 ఫోర్లు 248* ప‌రుగులతో సునీల్ గ‌వాస్క‌ర్ రికార్డును బ్రేక్ చేసిన స‌చిన్ టెండూల్క‌ర్

Sachin Tendulkar equalled Sunil Gavaskar's record : 2004లో బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టులో సచిన్ టెండూల్కర్ 34 టెస్టు సెంచరీలతో సునీల్ గవాస్కర్ రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్ లో ఇర్ఫాన్ పఠాన్ పది వికెట్లు ప‌డ‌గొట్టి భార‌త్ కు అద్భుత‌మైన విజ‌యాన్ని అందించారు. 
 

When Sachin Tendulkar equalled Sunil Gavaskar's record of Test centuries, India vs Bangladesh RMA
Author
First Published Aug 21, 2024, 5:11 PM IST | Last Updated Aug 21, 2024, 5:11 PM IST

Sachin Tendulkar equalled Sunil Gavaskar's record: సునీల్ గ‌వాస్కర్, స‌చిన్ టెండూల్క‌ర్ ఇద్ద‌రూ ప్ర‌పంచ క్రికెట్ లో లెజెండ‌రీ ప్లేయర్లు. అద్భుత‌మైన ఆట‌తో వారివారి కాలంలో స్టార్ ప్లేయ‌ర్లుగా నిలిచాడు. స‌చిన్ టెండూల్క‌ర్ క్రికెట్ లో ఎన్నో రికార్డుల‌ను బ్రేక్ చేయ‌డంలో పాటు కొత్త రికార్డులు సృష్టిస్తూ 'గాడ్ ఆఫ్ క్రికెట్' గా ప్ర‌సిద్ధి చెందాడు. అయితే, ప్ర‌పంచ క్రికెట్ లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ప్లేయ‌ర్ గా స‌చిన్ ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉన్నాడు. సచిన్ రికార్డుల ప్ర‌యాణం గ‌మ‌నిస్తే 2004 చాలా ప్ర‌త్యేకం. ఎందుకంటే ఆ ఏడాదిలోనే సునీల్ గ‌వాస్క‌ర్ సెంచ‌రీల రికార్డును స‌మం చేయ‌డంలో పాటు అధిగ‌మించాడు.

సెప్టెంబరు 19 నుండి చెన్నైలో భారత్-బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టెస్ట్ ఆడ‌నున్నాయి. గ‌తంలో ఈ రెండు జ‌ట్ల మ్యాచ్ ల‌లోనే సునీల్ గవాస్కర్ రికార్డును సచిన్ టెండూల్కర్ సమం చేసిన చారిత్రాత్మక క్షణాలు న‌మోదుచేశాడు. వాటిని గమనిస్తే.. 1970-1980లలో గవాస్కర్ భారత క్రికెట్ ఎదుగుదలకు పునాది వేయగా, టెండూల్కర్ 1990-2000లలో ప్రపంచ చిహ్నంగా మార్చాడు. వారి బ్యాటింగ్ రికార్డులు, నిలకడ, ఒత్తిడిలో రాణించగల సామర్థ్యం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట‌ర్ల‌కు ఇప్ప‌టికీ స్ఫూర్తినిస్తున్నాయి.

 When Sachin Tendulkar equalled Sunil Gavaskar's record of Test centuries, India vs Bangladesh RMA

టెస్టు క్రికెట్‌లో 10,000 పరుగులు చేసిన తొలి ఆటగాడు గవాస్కర్. దాదాపు రెండు దశాబ్దాల పాటు అత్యధిక టెస్టు సెంచరీలు (34) సాధించిన రికార్డును బంగ్లాదేశ్ టెస్టులో టెండూల్కర్ అధిగమించాడు. 2004 సిరీస్‌లో బంగ్లాదేశ్‌తో ఢాకాలోని బంగబంధు నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో టెండూల్కర్ గవాస్కర్ టెస్టు సెంచరీల రికార్డును సమం చేశాడు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టెస్ట్‌లో కపిల్ దేవ్ 434 వికెట్ల రికార్డును అనిల్ కుంబ్లే బద్దలు కొట్టి భార‌త్ త‌ర‌ఫున అత్య‌ధిక వికెట్లు తీసిన టెస్ట్ వికెట్-టేకర్‌గా నిలిచాడు. అలాగే, మూడు రోజుల్లో ముగిసిన ఇదే మ్యాచ్ లో ఇర్ఫాన్ ప‌ఠాన్ త‌న కెరీర్ లో మొద‌టిసారి 10 వికెట్లు తీసుకున్నాడు. 

డిసెంబర్ 2004లో ఢాకాలోని స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్‌లో పఠాన్ ఐదు వికెట్లు పడగొట్టడంతో బంగ్లాదేశ్‌ 184 పరుగులకు ఆలౌటైంది. ఆ త‌ర్వాత స‌చిన్ టెండూల్క‌ర్ త‌న విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించాడు. సచిన్ తన 34వ టెస్ట్ సెంచరీని పూర్తి చేసి సునీల్ గవాస్కర్ టెస్ట్ సెంచరీల రికార్డును సమం చేశాడు.  అలాగే, త‌న‌ కెరీర్-బెస్ట్ టెస్ట్ స్కోరు (248*)ను కూడా సాధించాడు. ఈ మ్యాచ్ లో సచిన్  గంగూలీతో మొదలు పెట్టి జహీర్ వ‌ర‌కు అద్భుత‌మైన భాగ‌స్వామ్యంతో భార‌త్ స్కోర్ బోర్డును 526 పరుగులకు చేర్చాడు. స‌చిన్ త‌న ఇన్నింగ్స్ లో 35 ఫోర్ల‌తో 248 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు.  రెండో ఇన్నింగ్స్ లోనూ ప‌ఠాన్ సూప‌ర్ బౌలింగ్ దెబ్బ‌కు బంగ్లా టీమ్ 202 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. దీంతో భార‌త్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విజయం సాధించింది.

'వెల్‌కమ్ టు సీఎస్కే'... ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్‌లోకి రిషబ్ పంత్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios