Asianet News TeluguAsianet News Telugu

మొదటిసారి నిన్ను డ్రెస్సింగ్ రూమ్‌లో కలిసినప్పుడు... విరాట్‌ని అభినందిస్తూ సచిన్ టెండూల్కర్ పోస్ట్..

ఆ రోజు నేను నువ్వు చేసిన దానికి నవ్వు ఆపుకోలేకపోయా. ఆ యంగ్ బాయ్ ఇప్పుడు ‘విరాట్’ ప్లేయర్‌గా ఎదగడం చాలా సంతోషంగా ఉంది... విరాట్ కోహ్లీ 50వ వన్డే సెంచరీపై సచిన్ టెండూల్కర్ పోస్ట్.. 

when i first met you in dressing room, Sachin Tendulkar congratulates Virat Kohli after 50th ODI ton CRA
Author
First Published Nov 15, 2023, 7:27 PM IST

సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్రపంచంలో క్రియేట్ చేసిన రికార్డులు ఎవ్వరైనా బ్రేక్ చేయగలరా? ఓ కార్యక్రమంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, స్వయంగా సచిన్‌ని ఈ ప్రశ్న అడిగాడు. అప్పుడు సచిన్ టెండూల్కర్.. ‘కచ్ఛితంగా ఈ రూమ్‌లోనే ఉన్నారు. విరాట్, రోహిత్.. వీళ్లిద్దరూ నా రికార్డులు బ్రేక్ చేయగలరని అనిపిస్తోంది. ఓ భారత బ్యాటర్ నా రికార్డు బ్రేక్ చేస్తే నేను హ్యాపీయే’ అంటూ వ్యాఖ్యానించాడు.

ఇది జరిగిన పదేళ్లకు మాస్టర్ వన్డే సెంచరీల రికార్డును బ్రేక్ చేశాడు విరాట్ కోహ్లీ. వన్డేల్లో 50 సెంచరీలు అందుకున్న విరాట్ కోహ్లీని ప్రత్యేకంగా ప్రశంసించాడు సచిన్ టెండూల్కర్..

‘భారత డ్రెస్సింగ్ రూమ్‌లో మొదటిసారి నిన్ను కలిశాను. మిగిలిన టీమ్ మేట్స్, నా కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలని నీతో ఫ్రాంక్ చేశారు. ఆ రోజు నేను నువ్వు చేసిన దానికి నవ్వు ఆపుకోలేకపోయా. ఆ యంగ్ బాయ్ ఇప్పుడు ‘విరాట్’ ప్లేయర్‌గా ఎదగడం చాలా సంతోషంగా ఉంది..

నా రికార్డును ఓ భారత క్రికెటర్ బ్రేక్ చేయడం నాకెప్పుడూ సంతోషమే. అదీ వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లాంటి వేదికపై, నా సొంత మైదానంలో చేయడం మరింత ఆనందంగా ఉంది...’ అంటూ ఇ‌న్‌స్టాలో పోస్ట్ చేశాడు సచిన్ టెండూల్కర్..  

Follow Us:
Download App:
  • android
  • ios