Asianet News TeluguAsianet News Telugu

టీ 20 ప్రపంచకప్ లో దారుణ ప్రదర్శన..వెస్టిండీస్ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ రాజీనామా...

టీ20 ప్రపంచకప్ లో తమ జట్టు దారుణమైన ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ విండీస్ హెడ్ కోచ్ రాజీనామా చేశారు. 

west indies head coach phil simmons to step down after t20world cup
Author
First Published Oct 25, 2022, 9:33 AM IST

వెస్టిండీస్ : వెస్టిండీస్ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. t20 ప్రపంచకప్-2022లో విండీస్ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ సిమన్స్ తన హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని విండీస్ క్రికెట్ బోర్డు కూడా ధ్రువీకరించింది. కాగా ఈ ఏడాది ఆఖరిలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ తర్వాత సిమన్స్ తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు. ‘వెస్టిండీస్ అనేది కేవలం ఒక జట్టు మాత్రమే కాదు.. కొన్ని దేశాల కలయిక. టీ20 ప్రపంచ కప్ లో మా జట్టు ప్రదర్శన కరీబియన్ అభిమానులకు నిరాశ కలిగించింది. మేము ఈ టోర్నీలో మా స్థాయికి తగ్గట్టు రాణించలేదు. ఇందుకు కరీబియన్ అభిమానులకు, మద్దతుదారులకు క్షమాపణ కోరుతున్నాను.  

ఆస్ట్రేలియాతో టెస్ట్ తరువాత వెస్టిండీస్ ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. ఇది నేను స్వయంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రమే.  ఆస్ట్రేలియా గడ్డపై మా జట్టు టెస్టు సిరీస్ కైవసం చేసుకునేలా నేను ప్రయత్నిస్తాను’ అని విలేకరుల సమావేశంలో సిమన్స్  పేర్కొన్నాడు.  కాగా,  2016లో టి 20 ప్రపంచకప్ ను విండీస్ కైవసం చేసుకోవడంలో సిమన్స్ కీలక పాత్ర పోషించాడు.

సౌతాఫ్రికాకు షాకిచ్చిన వరుణుడు.. జింబాబ్వేకు తప్పిన ఓటమి గండం

ఐర్లాండ్, స్కాట్లాండ్ చేతిలో ఘోర పరాజయం...
ఈ ఏడాది ప్రపంచ కప్ లో కరీబియన్ జట్టు కనీసం క్వాలిఫైయింగ్ దశను కూడా దాటలేకపోయింది. రౌండ్ వన్ లో  విండీస్ దారుణంగా విఫలమైంది. ఐర్లాండ్, స్కాట్లాండ్ లాంటి  వంటి పసికూనల చేతిలో కూడా విండీస్ ఘోర ఓటమిని చవిచూసింది. ఇక 20 ప్రపంచకప్ లో తమ జట్టు ప్రదర్శనపై పూర్తిస్థాయి సమీక్ష జరుపుతామని ఇప్పటికే విండీస్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ ప్రకటించినసంగతి తెలిసిందే. మరోవైపు  కెప్టెన్ నికోలస్ పూరన్ పై కూడా వేటు పడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios