హైదరాబాద్: స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా రిటైర్మెంట్ పై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. సెకండ్ ఇన్నింగ్స్  క్లబ్ కు ఆయన ప్రజ్ఢాన్ ఓజాకు స్వాగతం చెప్పాడు. తన అధికారిక ట్విట్టర్ లో సచిన్ టెండూల్కర్ ఓజా రిటైర్మెంట్ పై స్పందించాడు. ట్విట్టర్ లో తన పోస్టును ఓజాకు సచిన్ టెండూల్కర్ కు ట్యాగ్ చేశాడు. 

బౌలింగ్ చేస్తున్నప్పుడు ఓజా నైపుణ్యాలను చూడడం గొప్పగా ఉంటుందని, పది వికెట్లు తీసి తన వీడ్కోలు మ్యాచ్ ను ఓజా ప్రత్యేకతను నిలబెట్టుకున్నాడని ఆయన అన్నాడు. "పనిలో నీ నైపుణ్యాన్ని, విశాల హృదయాన్ని చూడడం గొప్పగా ఉంటుంద"ని అన్నాడు. "సెకండ్ ఇన్నింగ్స్ క్లబ్ కు స్వాగతం. ఓ నా మిత్రుడా! కాస్తా నవ్వు ముఖంతో" అని సచిన్ టెండూల్కర్ అన్నాడు. 

Also Read: స్నిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా వీడ్కోలు: అన్ని ఫార్మాట్లకు గుడ్ బై

క్రికెట్ నుంచి వీడ్కోలు పలుకుతూ ప్రజ్ఞాన్ ఓజా శుక్రవారం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ట్విట్టర్ వేదికగా ఆయన తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు. దాంతో అతని 16 ఏళ్ల క్రికెట్ కెరీర్ కు తెర పడింది. 

టెస్టు క్యాప్ ను సచిన్ టెండూల్కర్ నుంచి స్వీకరించడం, టెస్టు క్రికెట్ లో వంద వికెట్లు తీయడం తనకు మరుపురాని విషయాలని ఓజా తన ప్రకటనలో అన్నాడు.