ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి టీమిండియా అప్పుడే అస్త్రశస్త్రాలు, వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. దీనిలో భాగంగా ప్రపంచకప్‌ ఆడబోయే జట్టులోని సభ్యులును ఇప్పటికే గుర్తించామని అన్నాడు టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్.

Also Read:కోబ్ బ్రియాంట్ మృతి... 2012లోనే ఊహించిన నెటిజన్, ట్వీట్ వైరల్

భారత జట్టు వరుసగా సిరీస్‌లు ఆడుతుండటంతో కూర్పుపై ఒక అంచనాకు వచ్చామన్నాడు. వారి పేర్లను తనతో పాటు మేనేజ్‌మెంట్ కూడా గుర్తించిందని, తప్పనిసరి పరిస్థితుల్లో తప్పితే వారిని పక్కకు పెట్టమని విక్రమ్ వెల్లడించాడు.

కొత్త జనరేషన్ క్రికెటర్లు అసాధారణమైన నైపుణ్యంతో ఉన్నారని.. వారు ఫార్మాట్‌కు తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకోవడాన్ని తాను గుర్తించానని తెలిపారు. ప్రస్తుత న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉందని రాథోడ్ కొనియాడారు.

Also Read:ధోనీ కోసం ఖాళీగా ఉంచాం: ఉద్వేగానికి గురైన చాహల్

మరీ ముఖ్యంగా కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లను ఆకాశానికి ఎత్తేశాడు. వీరిద్దరూ జట్టు అంచనాలకు అనుగుణంగా ఆడుతూ విజయాల్లో పాలుపంచుకోవడం సంతృప్తిగా ఉందని రాథోడ్ వెల్లడించాడు.