ప్రముఖ బాస్కెట్ బాల్ ఆటగాడు కోబ్ బ్రయింట్ ఆకస్మిక మృతి యావత్ క్రీడాభిమానులను దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆయన మరణ వార్తను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆదివారం కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో కోబ్, ఆయన కుమార్తె జియానా(13) తో సహా 9మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉంటే తాజాగా కోబ్ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కోబ్ మరణాన్ని ఓ నెటిజన్ 2012లోనే ఊహించడం గమనార్హం. దీనికి సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారడం గమనార్హం.

Also Read హెలికాఫ్టర్ క్రాష్.. మరణానికి ముందు బ్రియాంట్‌ చేసిన చివరి కామెంట్!.

నోసో అనే పేరుతో ఓ ట్విట్టర్ యూజర్.. బాస్కెట్ బాల్ దిగ్గజం హెలికాప్టర్ ప్రమాదంలో మరణిస్తాడని  2012 నవరంబర్ 14వ తేదీన ట్వీట్ చేశాడు.  కాగా.. ఈ ట్వీట్ పై పలువురు మండిపడుతుండటం గమనార్హం. కొందరైతే తేదీ ఎడిట్ చేసి ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

అయితే... ఆ ట్వీట్ లో పేర్కొన్నట్లు కోబ్ విమాన ప్రమాదంలోనే చనిపోవడం గమనార్హం. అయితే... సదరు నెటిజన్ ఎనిమిదేళ్ల క్రితం చేసిన తన ట్వీట్ కి తాజాగా క్షమాపణలు చెప్పడం విశేషం.

కాగా... ఆదివారం ఉదయం 9గంటల ప్రాంతంలో కోబ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లాస్ ఎంజెల్స్ లో ఓ కొండను ఢీకొట్టి కుప్పకూలింది. ఈ ఘటనలో ఆయనతోపాటు ఆయన కుమార్తె కూడా ప్రాణాలు విడిచారు.