టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్.. తొలిసారిగా ఐపీఎల్ లో కెప్టెన్ బాధ్యతలు నిర్వహించాడు. ఢిల్లీ కాపిటల్స్ జట్టుకి రిషబ్ పంత్.. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. తొలిసారి అయనప్పటికీ.. జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2021 సీజన్ లో ఢిల్లీ జట్టు అదరగొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ పై కూడా విజయం సాధించిందంటే.. ఢిల్లీ ఎంత ధీటుగా ఆడిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రిడెట్ మొత్తం కెప్టెన్ గా పంత్ కే దక్కుతుంది.

అయితే.. అనూహ్యంగా కొందరు క్రికెటర్లు కరోనా బారిన పడటంతో.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మళ్లీ నిర్వహిస్తారనే నమ్మకం కూడా ఎవరికీ లేదు. దీంతో.. క్రికెటర్లంతా వాళ్ల వాళ్ల ఇళ్లను చేరిపోయారు. పంత్ కూడా.. తన ఇంటికి చేరుకున్నాడు. అయితే.. కొద్ది రోజులు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

దీంతో... తాను క్వారంటైన్ లో ఉంటున్న విషయాన్ని పంత్ ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు. ‘ యే దిల్ మాంగే మోర్, ఫోర్స్డ్ క్వారంటైన్ బ్రేక్. కానీ.. ఇండోర్ లో కూడా యాక్టివ్ గా ఉండటం సంతోషంగా ఉంది. మీరు కూడా ఇంట్లోనే సురక్షితంగా ఉండండి’ అంటూ అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేశాడు.

మొన్నటి వరకు ఐపీఎల్ లో బిజీగా ఉండి వచ్చిన పంత్ కి.. బలవంతంగా క్వారంటైన్ అవ్వాల్సి వచ్చింది. అందుకే.. మనసు  ఇంకా ఎక్కువగా కోరుకుంటోంది.. కానీ సాధ్యం కాదు కదా అంటూ ట్వీట్ చేయడం విశేషం. ఈ ఐపీఎల్ లో ఢిల్లీ జట్టు మొత్తం 8 మ్యాచులు ఆడగా.. అందులో పంత్ 213 పరుగులు చేశాడు. రెండు హాఫ్ సెంచరీలు తన పేరిట నమోదు చేసుకున్నాడు.