క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తో ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ముద్దుల కుమారుడు ఇమ్రాన్ బాక్సింగ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోని స్వయంగా సచిన్ తన సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం.

Also Read ఫైనల్లో ఓటమి: ఏడ్చేసిన షెఫాలీ వర్మ, ఓదార్చిన హర్మాన్ ప్రీత్ కౌర్...

పూర్తి వివరాల్లోకి వెళితే... సచిన్ టెండుల్కర్ ఓ ఈవెంట్ లో పాల్గొనగా.. ఆ కార్యక్రమానికి ఇర్ఫాన్ పఠాన్ తన ముద్దుల కుమారుడితో కలిసి అక్కడికి వచ్చాడు. అక్కడ.. సచిన్ పక్కన ఉన్న ఓ బెంచీపై ఇర్ఫాన్ కుమారుడు ఇమ్రాన్ నిల్చొని ఉన్నాడు. అక్కడ సచిన్ ఎత్తుతో పొల్చుకుంటూ... నేను పొడుగ్గా ఉన్నానంటూ ఆ బుడ్డోడు ఆనందపడ్డాడు. అనంతరం తన మజిల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయంటూ సచిన్ తో ఫైట్ చేశాడు. ఈ వీడియోని సచిన్, ఇర్ఫాన్ లు తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

 

‘‘ ఇమ్రాన్ ఏం చేశాడో కూడా వాడికి తెలీదు.. పెద్దయ్యాక తాను చేసింది బాక్సింగ్ అని తెలుసుకుంటాడేమో’’ అనే క్యాప్షన్ తో వీడియోని షేర్ చేశాడు. దానికి సచిన్ స్పందించాడు. ‘ చిన్న పిల్లలతో ఎప్పుడూ సరదాగానే ఉంటుంది. పెరిగి పెద్దయ్యాక నీ మజిల్స్ నా కన్నా, మీ నాన్న ఇర్ఫాన్ కన్నా బలంగా తయారౌతాయి.’’ అంటూ సచిన్ ఆ వీడియోకి కామెంట్ చేశాడు.

కాగా... ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సచిన్, ఇర్ఫాన్ ఫఠాన్ లు రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో పాల్గొంటున్నారు. ఈ సిరీస్ లో ఐదు దేశాలు టీ20 టోర్నమెంట్ లో పాల్గొననున్నాయి.  అందులో భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా దేశాల పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి.