మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్స్ లో భారత్ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్స్ లో ఆస్ట్రేలియా జట్టు విజయ ఢంకా మోగించింది.  ఫైనల్స్ లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు చేధించలేకపోయింది. దీంతో.. ట్రోఫీ ఆసిస్ జట్టు కైవసమైంది.

Also Read మహిళల టీ20 ప్రపంచకప్: ఫైనల్‌లో భారత్ చిత్తు చిత్తు, ఐదోసారి విశ్వవిజేతగా ఆసీస్...

కాగా.. ట్రోఫీ గెలిచిన ఆనందంలో ఆస్ట్రేలియా జట్టు చిందులు వేసింది. అమెరికన్ పాప్ స్టార్ కేటీ పెర్రీ తో కలిసి తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. కేటీ పెర్రీతో కలిసి స్టేజీపై చిందులు వేశారు. అదిరిపోయే స్టెప్పులతో అదరగొట్టారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

 

ఈ వీడియో.. ఆసిస్ మహిళా జట్టు క్రికెటర్లు.. తమలోని డ్యాన్స్ ప్రతిభను బయటపెట్టారు. ప్రొఫెషనల్ డ్యాన్సర్స్ మాదిరిగా స్టెప్పులు వేశారు. కాగా.. ప్రస్తుతం ఈవీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

కాగా.. ఈ వీడియోకి సంబంధించిన అనుభూతిని మోలినెక్స్ మరో వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ వీడియోలొ మోలినెక్స్ తమ డ్యాన్స్ పర్ఫామెన్స్ గురించి కూడా వివిరించారు. తాను ఇప్పటి వరకు ఆ డ్యాన్స్ వీడియోని  నాలుగుసార్లు చూశానని చెప్పారు. పాప్ స్టార్ కేటీ పెర్రీతో కలిసి డ్యాన్స్ వేయడం చాలా ఆనందంగా ఉందని.. ఆ వీడియోలో తాను కూడా ఉన్నాననే నిజం తనను ఆనందంలో ముంచెత్తుతోందని చెప్పింది. కేటీ పెర్రీతో తమతో చాలా హుందాగా వ్యవహరించిందని చెప్పింది. తమకు ఇది చాలా స్పెషల్ అని ఆమె పేర్కొంది.