అల్లుఅర్జున్ ‘అల వైకుంఠపురంలో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తీసుకొచ్చాడు క్రికెటర్ డేవిడ్ వార్నర్. సన్‌రైజర్స్ హైదరాబాద్ టిక్ టాక్ ఫ్యాన్స్ కోరిక మేరకు చేసిన ‘బుట్టబొమ్మ’ సాంగ్ స్టెప్పులు, సోషల్ మీడియాలో సంచలనం క్రియేట్ చేశాయి.

ఐపీఎల్ 2020 సమయంలోనూ ‘బుట్టబొమ్మ’ సాంగ్ స్టెప్పులతో సెలబ్రేట్ చేసుకున్నాడు డేవిడ్ వార్నర్. తన పాటకి ఇంత క్రేజ్ రావడానికి డేవిడ్ వార్నరే కారణమని స్వయంగా అల్లు అర్జున్ కూడా ఒప్పుకున్నాడు.
రెండో వన్డేలో గాయపడి టీ20 సిరీస్‌కి, మొదటి రెండు టెస్టులకి దూరమైన డేవిడ్ వార్నర్... మూడో టెస్టులో బరిలో దిగబోతున్నాడు.

డేవిడ్ వార్నర్ ఆడిన మ్యాచుల్లో ఆస్ట్రేలియాకి మంచి రికార్డు ఉంది. వార్నర్‌కి టీమిండియాపై మంచి ట్రాక్ రికార్డు ఉంది. దాంతో వార్నర్‌ను అవుట్ చేసేందుకు వికెట్ల వెనకాల ‘బుట్టబొమ్మ’ సాంగ్ పాడాలంటూ రిషబ్ పంత్‌కి సలహా ఇచ్చాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్.

‘బుట్టబొమ్మ’ సాంగ్ పాడితే వార్నర్ ఫోకస్ దెబ్బతింటుందని, అప్పుడు స్టంపౌట్ చేసి ‘బిగ్ బుల్’ వికెట్ పడగొట్టాలంటూ ఫోటోల ద్వారా తెలియచేశాడు. ఈ సలహాను రిషబ్ పంత్ ఎంత వరకూ పాటిస్తాడో తెలియాలంటే సిడ్నీ టెస్టులో ఆసీస్ ఇన్నింగ్స్ దాకా వేచి చూడాల్సిందే.