ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ 96 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచి, సెంచరీ చేసే అవకాశం కోల్పోయిన విషయం తెలిసిందే.

వాషింగ్టన్ సుందర్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పిన అక్షర్ పటేల్ రనౌట్ కావడం, ఆ తర్వాత ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్ డకౌట్ కావడంతో 96 పరుగులతో ఉన్న సుందర్‌కి బ్యాటింగ్ చేసే అవకాశం దొరకలేదు...

దీంతో వాషింగ్టన్ సుందర్ వాళ్ల నాన్నకి అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్ దొరికితే, తిట్టినతిట్టు తిట్టకుండా తిడతాడనే రూపంలో ఓ మీమీని పోస్టు చేశాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్.

తాజాగా ఈ మీమీపై స్పందించిన వాషింగ్టన్ సుందర్... ‘థ్యాంక్యూ భయ్యా... నాన్న కచ్ఛితంగా వాళ్లకి కడుపు నిండి బిర్యా, హల్వా పెడతారు...’ అంటూ కామెంట్ చేశాడు.

వాషింగ్టన్ సుందర్ 96 పరుగుల ఇన్నింగ్స్‌పై కామెంట్ చేసిన ఆయన తండ్రి పి. సుందర్... ‘అక్షర్ పటేల్ రనౌట్ తర్వాత ఇషాంత్, సిరాజ్‌లలో ఎవరో ఒకరు ఓ నాలుగు బంతులు ఆపుకుని ఉంటే మావాడు సెంచరీ చేసేవాడు’ అని కామెంట్ చేసిన విషయం తెలిసిందే.