Asianet News TeluguAsianet News Telugu

కేదార్ బ్యాటింగ్ అద్భుతం... మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చుండాలి: సెహ్వాగ్ సెటైర్లు

కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయాన్ని చవిచూడటంపై సెహ్వాగ్ ఘాటుగా స్పందించాడు.

virendra sehwag satires on csk player kedar jadhav
Author
Hyderabad, First Published Oct 9, 2020, 1:13 PM IST

న్యూడిల్లీ: టీమిండియీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత వ్యాఖ్యాతగా మారిన విషయం తెలిసిందే. అయితే తాను చెప్పదల్చుకున్న విషయానికి కాస్త హాస్యాన్ని జోడించి చెప్పడం అతడి స్టైల్. చివరకు ఆయన విమర్శలు కూడా సెటైరికల్ గా, హాస్యాన్ని పండించేలా వుంటాయి. ఇలా ఐపిఎల్ సీజన్ 13లో వరుస ఓటములను చవిచూస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై విమర్శలు సంధించారు వీరేంద్ర సెహ్వాగ్. 

తన అధికారిక ఫేస్ బుక్ పేజీలో ''వీరు కి బైటక్'' పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సెహ్వాగ్. ఇందులో తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయాన్ని చవిచూడటంపై అతడు స్పందించాడు. ప్రత్యర్థి కోల్ కతా విసిరిన 168పరుగుల సాధారణ లక్ష్యాన్ని కూడా చేధించలేక ధోని సేన చతికిలపడటాన్ని చూస్తే ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు గుర్తుకువచ్చిందన్నారు. చెన్నై ఆటగాళ్లందరూ ప్రభుత్వోద్యుగుల మాదిరి అలసత్వం ప్రదర్శిస్తూ బ్యాటింగ్ చేశారంటూ సెహ్వాగ్ చురకలు అంటించారు. 

10 ఓవర్లలో 79 పరుగులు చేయాల్సిన స్థితిలో కూడా సీఎస్కే బ్యాట్స్‌ మెన్స్ పేలవ ప్రదర్శన ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. మరీ ముఖ్యంగా కేదార్ జాదవ్ ఆట జట్టు ప్రయోజనాలు తనకేమీ పట్టవన్నట్లు సాగిందన్నారు. ఆయన 12బంతుల్లో కేవలం 7పరుగులు మాత్రమే చేసినందుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాల్సిందని సెహ్వాగ్ ఎద్దేవా చేశారు. 

read more   IPL 2020: జాదవ్‌ ఆట అద్భుతం... జట్టు నుంచి తీసేయాలంటూ పిటిషన్...

బుధవారం చెన్నై వర్సెస్ కోల్‌కత మ్యాచులో దినేష్ కార్తీక్ నేతృత్వంలోని కేకేఆర్ 10 పరుగులతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మెన్ పరుగుల సునామీని కట్టడి చేసి అద్భుత విజయాన్ని నమోదు చేసింది  కోల్‌కత. కోల్‌కత తరుఫున ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాహుల్ త్రిపాఠి ఇన్నింగ్స్ వేరే లెవెల్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న  కోల్‌కత 167 పరుగులకు ఆల్ అవుట్ అయింది.  కోల్‌కత టీం లయ దొరకబుచ్చుకునేందుకు బ్యాటింగ్ ఆర్డర్లో అనేక మార్పులను చేసింది. 

ఈ మార్పుల్లో భాగంగా రాహుల్ త్రిపాఠి శుభమన్ గిల్ తో కలిసి ఓపెనర్ గా వచ్చాడు. వచ్చింది మొదలు ఇన్నింగ్స్ ఆద్యంతం చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఎవ్వరిని వదలకుండా, కనికరం చూపకుండా స్టేడియం నలువైపులా భారీ షాట్లనాడాడు. సెంచరీ పూర్తి చేసుకుంటాడు అనుకుంటున్నా తరుణంలో 81 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 8 ఫోరులు, మూడు సిక్సర్ల సహాయంతో కేవలం 51 బంతుల్లోనే 81 పరుగులు చేసాడు.

ఇక ఆ తరువాత బ్యాటింగ్ కి వచ్చిన చెన్నై బ్యాట్స్ మెన్ బాగానే సపోర్ట్ అందజేసినప్పటికీ... అందిన స్టార్ట్ ని, మూమెంటుమ్ చెన్నై ప్లేయర్స్ ముందుకు తీసుకెళ్లలేకపోయారు. చెన్నై ప్లేయర్స్ లో వాట్సన్ అర్థ సెంచరీ సాధించాడు.  కోల్‌కత బౌలర్లలో పాట్ కమిన్స్ మినిహా మిగితావారంతా తలా ఒక వికెట్ సాధించారు. 
 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios