Asianet News TeluguAsianet News Telugu

మన విహారి అందరి లెక్క సరిచేశాడు... కేంద్ర మంత్రికి వీరేంద్ర సెహ్వాగ్ సెటైర్...

హనుమ విహారి క్రికెట్‌ను చంపాడంటూ కేంద్రమంత్రి సుప్రియో ట్వీట్...

బాబుల్ సుప్రియోకి సెటైరికల్ రిప్లై ఇచ్చిన హనుమ విహారి...

విహారి ట్వీట్‌కి ఫిదా అయిన రవిచంద్రన్ అశ్విన్, వీరేంద్ర సెహ్వాగ్...

Virendra Sehwag Re-action on Hanuma Vihari, Central Minister supriyo CRA
Author
India, First Published Jan 15, 2021, 8:33 AM IST

టీ20, ఐపీఎల్ మ్యాచులు మాత్రమే చూసేవాళ్లకి టెస్టు క్రికెట్‌లో ఉండే అసలు సిసలు మజా అర్థం కాదు. బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ డిఫెన్స్ ఆడడంలో ఉండే కిక్కు, మజా వారికి పరమ బోరింగ్ ఆటగా అనిపిస్తుంది. ఇదే బాపతుకి చెందిన కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో... తెలియనివాడు తెలియనట్టు ఉండగా విహారిని క్లాస్ ఇన్నింగ్స్‌ను విమర్శిస్తూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

‘109 బంతులు ఆడి కేవలం 7 పరుగులా... భారత జట్టు చారిత్రక విజయం సాధించే అద్భుత అవకాశాన్ని హనుమ విహారి చంపేశాడు. ఇది ఘోరమైన నేరం... అవును నాకు క్రికెట్ గురించి ఏమీ తెలీదు’... అంటూ ట్వీట్ చేశాడు బాబుల్ సుప్రియో. ఈ ట్వీట్ పెద్ద దుమారమే రేపింది.

తనను పొగుడుతూ ట్వీట్ చేసిన వారందరికీ ఓపిగ్గా రిప్లై ఇచ్చిన తెలుగు క్రికెటర్ విహారి... సుప్రియోకి కూడా రిప్లై ఇచ్చాడు. మంత్రిగారు పెట్టిన ట్వీట్‌లో విహారికి బదులుగా ‘బిహారి’ అని రాశాడు. దాన్ని ఎత్తిచూపుతూ ‘అది హనుమ విహారి’ అంటూ సింపుల్‌గా రిప్లై ఇచ్చాడు విహరి. ఈ రిప్లైతో నీకు క్రికెట్ గురించే కాదు, క్రికెటర్ల పేరు కూడా తెలీదని ఎత్తిచూపాడు విహారి.

దీనిపై స్పందించిన అశ్విన్... ‘రోల్ఫ్ మ్యాక్స్’ (పడి పడి నవ్వలేక చస్తున్నా) అంటూ కామెంట్ పెట్టాడు. వీరేంద్ర సెహ్వాగ్ ‘మన విహారి... అందరి లెక్క సరిచేశాడు...’ అంటూ సమాధానం ఇచ్చాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios