ఉత్తర భారతదేశం పై మిడతల దండ్లు దాడి చేస్తున్న విషయం తెలిసిందే. మిడతల ధాటికి ప్రజలు వణికిపోతున్నారు. ఈ మిడతలు ఇప్పుడు దేశ పంజాబ్, హర్యానా రాష్ట్రాలను ధాటి దేశ రాజధాని ఢిల్లీకి కూడా చేరాయి. 

రాజధాని ఢిల్లీలో ఈ మిడతలు అధికంగా ఉండడంతో.... విమానాల పైలట్లకు ప్రత్యేక హెచ్చరికలను, మార్గదర్శకాలను జారీచేశారు. విమాన టేక్ ఆఫ్, లాండింగ్ సమయంలో ఈ మిడతల వల్ల ఇబ్బందులు తలెత్తే ఆస్కారం ఉందని అంటున్నారు ఎయిర్ పోర్ట్ అధికారులు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Locusts attack , right above the house #hamla

A post shared by Virender Sehwag (@virendersehwag) on Jun 26, 2020 at 11:59pm PDT

ఇక ఈ మిడతలు ఢిల్లీపై ఎలా దాడి చేతున్నాయో చూపెడుతూ తన ఇంటిపై తిరుగుతున్న మిడతల దండును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. 

గురుగ్రామ్ తదితర ప్రాంతాల్లో ప్రజలందరూ తమ కిటికీలను మూసి ఉంచాలని ఇప్పటికే మునిసిపల్ అధికారులు ఆదేశాలను జారీచేశారు. ఇప్పుడు మిడతలు ఆ శివారు ప్రాంతాలను దాటి ఇప్పుడు రాజధానిని కుదిపేస్తున్నాయి ఈ మిడతలు.