జీవితం అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే.. ఆ జీవితాన్ని అందంగా ఎలా మలుచుకోవాలో చాలా మందికి తెలీదు. కాగా.. అసలు అందమైన జీవితానికి రహస్యం ఇదేనంటూ  భారత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసి.. మరీ జీవితం గురించి వివరించారు.

బుధవారం ట్విటర్‌ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘  తన కూతురికి కొత్త బట్టలు కానుకగా ఇచ్చి.. కొత్త బట్టల్లో ఉన్న కూతురి ఫొటో తీయటం అన్నది ఓ తండ్రి జీవితంలో అత్యంత విలువైనది. అమాయకత్వం, ప్రేమ, చిన్న చిన్న విషయాలను ఆస్వాదించటం = ఓ అందమైన జీవితం ’’ అని పేర్కొన్నారు. 

 

దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఫొటో ఆఫ్‌ ది డే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో.. మీరు చెప్పింది నిజం సర్ అంటూ కితాబిస్తున్నారు.  అద్భుతమైన క్షణం.. మనసును హత్తుకునే చిత్రం.. మాటల్లో చెప్పటానికి వీలుకానిది.. సంతోషం చిన్నచిన్న విషయాల్లోనే ఉంటుంది. పిల్లల పెదాలపై చిరునవ్వు తేవటానికి తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.