Cricket: మెల్‌బోర్న్ టెస్ట్ రెండో రోజు మూడో సెషన్‌లో జైస్వాల్, కోహ్లీల మధ్య రన్ కోసం ఇచ్చిన కాల్ మిస్ కమ్యూనికేషన్ వల్ల భారత్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.

yashasvi jaiswal-Virat Kohli: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2024 లో భాగంగా నాలుగో టెస్ట్ మెల్‌బోర్న్‌లో జరుగుతోంది. ఈ బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత జట్టుకు వరుసగా దెబ్బలు తగిలాయి. ఇండియా కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరుస్తూ తక్కువ స్కోరుకే పెవిలియన్ కు చేరాడు. రెండో వికెట్‌కు జైస్వాల్, కేఎల్ రాహుల్ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ, భారత్ స్కోరు 51 వద్ద కేెఎల్ రాహుల్ (24 పరుగులు) కూడా ఔటయ్యాడు. రెండు వికెట్లు పడిన తర్వాత కోహ్లీ, జైస్వాల్ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి మధ్య 102 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. ఆ తర్వాత మ్యాచ్ పరిస్థితిని మార్చే ఘటన జరిగింది.

ఒక్క తప్పిదంతో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ

తొలి ఇన్నింగ్స్‌లో పుంజుకుంటున్న టీమిండియాకు మంచి సమయంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్కాట్ బోలాండ్ వేసిన చివరి బంతికి జైస్వాల్ రన్ తీసుకునే ప్రయత్నంలో రనౌట్ అయ్యాడు. బోలాండ్ బంతిని జైస్వాల్ లాంగ్ ఆన్ వైపు ఆడారు. అవతలి చివరన ఉన్న కోహ్లీ పరుగెత్తి మళ్ళీ క్రీజ్‌లోకి వచ్చేశారు. అప్పటికే జైస్వాల్ చాలా దూరం వచ్చేశాడు. ఫీల్డర్ బంతిని వికెట్ కీపర్‌కు విసిరేయడంతో జైస్వాల్ రనౌట్ అయ్యాడు. ఇద్దరు ఆటగాళ్ల తప్పుడు కమ్యూనికేషన్ వల్ల జైస్వాల్ రనౌట్ అయ్యాడు. సెంచరీకి దగ్గరగా వెళ్తున్న క్రమంలో జైస్వాల్ అవుట్ కావడం భారత జట్టు భారీ స్కోర్ ప్రయాణానికి అడ్డు తగిలింది. అయితే, ఇక్కడ కోహ్లీ బంతిని చూస్తున్నాడు. బాల్ ఫీల్డర్ చేతిలోకి వెళ్లగానే మళ్లీ వెనక్కి వచ్చాడు. కానీ, జైస్వాల్ దానిని పట్టించుకోకుండా పరుగుకోసం వచ్చాడు. ఇదంతా కూడా అకస్మాత్తుగా జరిగిపోయింది. ఇక్కడ చిన్న మిస్ కమ్యూనికేషన్ కారణంగా రనౌట్ జరిగింది.

Scroll to load tweet…

Scroll to load tweet…

జైస్వాల్ ఔటవగానే కోహ్లీ నిరాశ 

జైస్వాల్ రనౌట్ అయిన వెంటనే 43వ ఓవర్ తొలి బంతికి కోహ్లీ కూడా ఔటయ్యాడు. కోహ్లీ మంచి లయలో ఉన్నాడు. కానీ, జైస్వాల్ ఔటవగానే కోహ్లీ లయ తప్పి ఆఫ్ స్టంప్ బంతిని ఆడబోయి క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఇద్దరు సెట్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరారు. వీరి తర్వాత అక్షర్ పటేల్ కూడా సున్నా పరుగులకే ఔటయ్యాడు. దీంతో భారత్ కష్టాల్లో పడింది. 

జైస్వాల్-కోహ్లీ మంచి భాగస్వామ్యం

జైస్వాల్ మొదటి నుంచి అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే, 82 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. తన ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. ఇక కోహ్లీ కూడా మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు. అతని బ్యాట్ నుంచి మరో సెంచరీ వస్తుందని అందరూ భావించారు. కానీ, జైస్వాల్ ఔటవడంతో కోహ్లీ లయ తప్పి ఔటయ్యాడు. కోహ్లీ 36 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు ఉన్నాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.