ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ప్రతి ఒక్కరు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రజలు ఎక్కువగా ఫాలో అయ్యే సినీ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రిటీలను ఓటర్లను చైతన్యపర్చడానికి ఈసి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగిస్తుంటాయి. అయితే కేవలం ఓటర్లను చైతన్యపర్చడమే కాదు స్వయంగా తాము కూడా ఓటు వేసి సెలబ్రిటీలు ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే మరికొద్దిరోజుల్లో ముంబైలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఓటేయాలని భావిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈసి షాకిచ్చింది.

విరాట్ కోహ్లీ తాము విధించిన గడువులోపు దరఖాస్తు చేసుకోకపోవడంతో ఓటేసే అవకాశాన్ని కోల్పోయినట్లు ముంబైకి చెందిన ఓ ఎన్నికల అధికారి తెలిపారు. స్వతహాగా డిల్లీ నివాసి అయిన విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ తో కలిసి ప్రస్తుతం ముంబైలో నివాసముంటున్నాడు. దీంతో ముంబైలోనే ఓటరుగా నమోదు చేయించుకోవాలని భావించాడు. ఇందుకోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నాడని ఎన్నికల అధికారి వెల్లడించారు.
అయితే లోక్ సభ ఎన్నికల ఓటు హక్కు పొందాలంటే మార్చి 30 లోపు దరఖాస్తు చేసుకోడానికి గడువు విధించినట్లు తెలిపారు. అయితే కోహ్లీ గడువు ముగిసిన తర్వాత ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నాడు...అందువల్ల లోక్ సభ ఓటర్ల జాబితాలో అతడి పేరు చేర్చలేకపోయామని తెలిపారు. అందువల్ల కోహ్లీకి ఈసారి ఓటేసే అవకాశం లేదని సదరు అధికారి వెల్లడించారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Apr 27, 2019, 11:17 PM IST