Asianet News Telugu

భారత్ లో కరోనా కలకలం... అభిమానులకు కోహ్లీ సూచనలివే

కరోనా వైరస్ భారత్ లో విజృంభిస్తున్న నేపథ్యంలో రాజకీయ, క్రీడా, సీని రంగాలతో పాటు ఇతర రంగాల్లోని ప్రముఖులు ప్రజలకు ధైర్యం చెప్పడమే కాదు ముందస్తు జాగ్రత్తలు సూచిస్తున్నారు. అలా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా సోషల్ మీడియా వేదికన దేశ ప్రజలకు ఓ సందేశాన్ని అందించారు. 

Virat Kohli tweeted about the coronavirus pandemic
Author
New Delhi, First Published Mar 14, 2020, 7:49 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూడిల్లీ: భారత దేశానికి పొరుగునే వున్న చైనాలో ప్రారంభమై ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది కరోనా వైరస్. ఇంతకాలం ఈ  వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాల్లో విజృంభిస్తున్న భారత ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్తల వల్ల చాలాకాలం దేశంలోకి ప్రవేశించలేదు. అయితే ఇటీవల భారత్ లోకి ఇటీవలే ప్రవేశించిన ఈ ఈ వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 80మంది ఈ వైరస్ బారిన పడగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజల్లో భయాందోళన మొదలయ్యింది. 

ఈ క్రమంలోనే రాజకీయ, క్రీడా, సీని రంగాలతో పాటు ఇతర రంగాల్లోని ప్రముఖులు ప్రజలకు ధైర్యం చెప్పడమే కాదు ముందస్తు జాగ్రత్తలు సూచిస్తున్నారు. అలా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా సోషల్ మీడియా వేదికన దేశ ప్రజలకు ఓ సందేశాన్ని అందించారు. 

''కరోనా వైరస్ కు భయపడకుండా దీన్ని అంతమొందించడానికి ప్రజలందరూ పోరాడాలి. ఈ వైరస్ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా వుండండి. వైరస్ సోకిన తర్వాత చికిత్స పొందడం కంటే సోకకముందే జాగ్రత్త పడటం మంచిది'' అంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు. 

read more  గబ్పిలాలను, కుక్కలను ఎలా తింటారు: కరోనావైరస్ పై షోయబ్ అక్తర్

కరోనా వైరస్ వల్ల ఐపిఎల్ మ్యాచులను ఖాళీ స్టేడియంలలో నిర్వహిస్తే భారీ నష్టాలూ తప్పవు. అంతేకాకుండా ఈ వైరస్ మరింత వ్యాప్తిచెందే అవకాశం వుంటుంది.  అందుకోసమని మరొక 15 రోజులపాటు గనుక ఐపీఎల్ షెడ్యూల్ ని పోస్ట్ పోనే చేస్తే బాగుండని బిసిసిఐ, ఐపిఎల్ మేనేజ్ మెంట్ భావించింది.  దానికి బీసీసీఐ సూత్రప్రాయ అంగీకారం కూడా తెలిపినట్టు సమాచారం.

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం వణికిపోతుంది. జనాలు బయట తిరగాలంటేనే జంకుతున్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ... భారత ప్రభుత్వం కూడా ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు అన్ని చర్యలను తీసుకుంటుంది. తాజాగా నిన్న సాయంత్రం క్రీడా మంత్రిత్వ శాఖ క్రీడల నిర్వహణకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఏప్రిల్ 15వ తేదీ వరకు ఏ క్రీడను వీక్షినడానికి కూడా ప్రజలు భారీ ఎత్తున గుమికూడదని ఆదేశించారు. నిర్వహించాల్సి వస్తే... క్లోస్డ్ డోర్స్ లో మాత్రమే నిర్వహించాలని చెప్పింది. 

 వాస్తవానికి ఈ నెల 29 నుంచి ఈ టోర్నీ ప్రారంభమవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా బీసీసీఐ ని అన్ని ఫ్రాంచైజీలు ఒక రెండు వారాలపాటు వాయిదా వేయమని కోరాయి. వెంటనే స్పందించిన బీసీసీఐ అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్న బీసీసీఐ వాయిదా వేసింది. బీసీసీఐ లోని సభ్యులు సూత్రప్రాయ అంగీకారం తీసుకోగానే... మరింత ఆలస్యం చేయకూడదని భావించిన బోర్డు వెంటనే అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. 

read more  ఐపీఎల్ వాయిదా, ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ ?.. గవాస్కర్

ఈ నెలాఖరులో ప్రారంభంకావాల్సిన ఈ మెగా ఈవెంట్  వచ్చేనెల ఏప్రిల్ 15వ తేదీ వరకు వాయిదా పడింది. అప్పుడు బీసీసీఐ మరోసారి పరిస్థితిని అంచనా వేసి నిర్ణయం తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. 

ఇకపోతే చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఐపీఎల్ నిర్వహణను తాము అనుభవించామని చెప్పాయి. మహారాష్ట్ర సర్కార్ తాము ఇలా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడలేమని వారు తెలిపారు. తాజాగా ఢిల్లీ సర్కార్ కూడా ఇదే విధంగా స్పందించింది. రాష్ట్రప్రభుత్వాలు కోర్టుకు కూడా ఎక్కాయి. అందుకోసమని కొన్ని రోజులపాటు వాయిదా వేస్తే. అప్పుడు వారికి పరిస్థితులను మరో మారు సమీక్షించి తదుపరి నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది.  

 

Follow Us:
Download App:
  • android
  • ios