Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ వాయిదా, ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ ?.. గవాస్కర్

దేశ ప్రజల ఆరోగ్యమే అన్నిటికన్నా ముఖ్యమని చెప్పారు. కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో ఈ నిర్ణయం చాలా అవసరమన్నారు. ఐపీఎల్ మ్యాచ్ లను వీక్షించేందుకు వేలాది మంది వస్తారని అన్నారు.

Most sensible decision taken by BCCI: Sunil Gavaskar after suspension of IPL 2020 and South Africa ODIs
Author
Hyderabad, First Published Mar 14, 2020, 11:13 AM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టిస్తున్న కలకలం అంతా ఇంతా కాదు. వేల మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ ని వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కాగా... ఐపీఎల్ వాయిదా విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పట్ల టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, క్రికెటర్ హర్బజన్ సింగ్ స్పందించారు.

Also Read కరోనా ఎఫెక్ట్: భారత్, దక్షిణాఫ్రికా సిరీస్ రద్దు...

ఐపీఎల్ ని వాయిదా వేస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని సునీల్ గవాస్కర్ తెలిపారు. ఈ విషయంలో బీసీసీఐ కి అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. దేశ ప్రజల ఆరోగ్యమే అన్నిటికన్నా ముఖ్యమని చెప్పారు. కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో ఈ నిర్ణయం చాలా అవసరమన్నారు. ఐపీఎల్ మ్యాచ్ లను వీక్షించేందుకు వేలాది మంది వస్తారని అన్నారు.

వారంతా హోటల్స్ లో, ఎయిర్ పోర్టులలో ఉంటారని.. చాలా మంది విమానాల్లో ప్రయాణిస్తారని.. ఎవరైనా వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ క్రమంలో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ తీసుకున్న నిర్ణయం అభినందించతగినదని గవాస్కర్ అన్నారు.

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ ను ప్రేక్షకులు లేకుండా నిర్వహించొచ్చు కదా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు గవాస్కర్ స్పందించారు. ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలో ఆట ఆడాలని ఏ క్రికెటర్ కోరుకోడని చెప్పారు. ప్రేక్షకులు ఉత్సాహంగానే ఉంటనే క్రికెటర్లు ఆట ఆడగలరని చెప్పారు.

ఇక ఇదే విషయంపై హర్భజన్ సింగ్ కూడా స్పందించారు. పరిస్థితులను బట్టి అనేక విషయాలు ముడిపడి ఉంటాయన్నారు. అప్పటికీ ఈ పరిస్థితుల్లో మార్పులు రాకపోతే ... ఐపీఎల్ నిర్వహించడం కుదరదని చెప్పారు. ఐపీఎల్ తో అనేక మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయన్నారు. ప్రజల ఆరోగ్యం ముఖ్యమన్నారు.నెల తర్వాతైనా మ్యాచులు పెట్టుకోవచ్చని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios