టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడంటే..పరుగుల వర్షం కురవాల్సిందే. ఇప్పటికే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. శుక్రవారం శ్రీలంకతో  జరిగిన మ్యాచ్ లో అత్యంత వేగంగా 11000 పరుగులు చేసిన క్రికెటర్ గా ఘనత సాధించాడు. ఆట విషయంలో ఎంత సీరియస్ గా ఉన్నా...  కోహ్లీలో హాస్య చతురుత కాస్త ఎక్కువేనని  అతని సన్నిహితులు చెబతుంటారు.

తాజాగా.. కోహ్లీ చతురత సోషల్ మీడియా వేదికగా మరోసారి బయటపడింది. తన తోటి క్రికెటర్ ఇషాంత్ శర్మను సోషల్ మీడియా వేదికగా కోహ్లీ ట్రోల్ చేశాడు. కాగా... ఇప్పుడు కోహ్లీ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read కివీస్ తో పోరుకు జట్టు: శాంసన్ కు నిరాశ, రోహిత్ పాటు ధావన్, రాహుల్ సైతం...

ఇంతకీ మ్యాటరేంటంటే...  ఇటీవల ఇషాంత్ శర్మ.. తన సోషల్ మీడియాలో ఓ ఫోటో పెట్టాడు. దానికి క్యాప్షన్ గా..  మనకున్న లైఫ్ ఒక్కటేనని, ఉన్నంతకాలం చక్కగా జీవించాలననే అర్ధంతో వేదాంత ధోరణిలో ఒక పోస్టు పెట్టాడు.  తన ఫోటో కూడా యోయో అంటూ ఒక సంకేతాన్ని  ఇచ్చేలా ఫోజ్ ఇచ్చాడు.  

ఆ వెంటనే లైన్‌ లోకి వచ్చిన కోహ్లీ.. ఆ విషయం మాకు ఇప్పటివరకు తెలియదు అంటూ వ్యంగ్యంతో కూడిన చమత్కారంతో పోస్ట్ చేశాడు. కోహ్లీ ఉద్దేశం మేరకు ఇప్పటివరకు ఎవరికీ తెలియని గొప్ప విషయాన్ని ఇషాంత్ చెప్పినట్లు ఫోజు కొడుతున్నాడని అతణ్ని ట్రోల్ చేసినట్లు తెలుస్తోంది.దీనికి సంబంధించిన పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.