న్యూజిలాండ్‌తో తలపడేందుకు టీమిండియా రెడీ అయ్యింది.  ఈ నెల 24 నుంచి ఈ టీ20 సిరీస్‌ జరగనుంది. లంకతో సిరీస్‌ నుంచి విశ్రాంతి తీసుకున్న వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ జట్టులోకి తిరిగొచ్చారు.  కాగా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదు. కివీస్‌ పర్యటనలో ఆతిథ్య జట్టుతో ఆడే ఐదు టీ20ల సిరీస్‌ కోసం 16 మందితో కూడిన భారత జట్టును ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ ఆదివారం ప్రకటించింది.

Also Read న్యూజిలాండ్ టూర్ కు టీం ఇండియా సెలక్షన్ నేడే: సంజు సాంసన్ ఉంటాడా...?

సుదీర్ఘ కాలం బెంచ్‌పై నిరీక్షించిన అనంతరం లంకతో చివరి టీ20లో తుదిజట్టులో చోటు దక్కించుకున్న శాంసన్‌.. ఒక్క సిక్సర్‌ కొట్టి ఔటైన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌ టూర్‌లో జరిగే మూడు వన్డేలు, రెండు టెస్టుల కోసం జట్టును ఆదివారమే ప్రకటించాల్సి ఉన్నా.. సెలెక్షన్‌ కమిటీ తాత్కాలికంగా వాయిదా వేసింది. హార్దిక్‌ పాండ్య ఫిట్‌నెస్‌పై నెలకొన్న సందిగ్ధతే ఇందుకు కారణమని సమాచారం.

టీ20 జట్టు: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్ శర్మ‌, కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషబ్‌ పంత్‌, శివం దూబే, కుల్దీప్ యాదవ్‌‌, చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, జస్ప్రిత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, నవదీప్‌ సైనీ, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్‌.