Asianet News TeluguAsianet News Telugu

Virat Kohli: రూట్ ను కాపీ కొట్టిన కోహ్లి.. అయినా విఫలం.. వీడియో వైరల్

Virat Kohli - Joe Root: ప్రపంచ దిగ్గజ బ్యాటర్, టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ ను కాపీ కొట్టాడు. లీస్టర్షైర్ తో ప్రాక్టీస్ మ్యాచ్ లో అలా చేసి విఫలమయ్యాడు. 

Virat kohli Tries to Copy Joe Root Bat balancing Magic, but Failed
Author
India, First Published Jun 24, 2022, 10:54 AM IST

క్రికెట్ లో ఒకరి శైలిని ఒకరు కాపీ కొట్టడం సహజమే. ఈ మధ్య పాపులర్ డైలాగులు, డాన్స్ మూవ్ లను కాపీ చేయడం క్రికెటర్లకు సర్వ సాధారణమైపోయింది.  కానీ ఒక దిగ్గజ బ్యాటర్ చేసిన చర్యను మరో దిగ్గజ  ఆటగాడు కాపీ కొట్టడం చాలా అరుదు. గురువారం టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి అలాంటి పనే చేశాడు. కానీ అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. ఇంగ్లాండ్ మాజీ సారథి జో రూట్..  బ్యాట్ బ్యాలెన్సింగ్ చేసినట్టు కోహ్లి ట్రై చేసినా విఫలమయ్యాడు. 

ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రూట్  నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్నప్పుడు బ్యాట్ ను ఒక దగ్గర పెడితే అది  నిటారుగా ఎటూ కదలకుండా ఉండిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. 

తాజాగా లీస్టర్షైర్ తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ లో  కోహ్లి కూడా అలాగే ట్రై చేశాడు. భారత జట్టు అప్పటికే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా  స్ట్రైకింగ్ ఎండ్ లో రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తుండగా నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న కోహ్లి రూట్ మాదిరిగానే బ్యాట్ ను బ్యాలెన్స్ చేయాలని ట్రై చేశాడు.  కానీ రూట్ బ్యాట్ లాగా కోహ్లి బ్యాట్ బ్యాలెన్స్డ్ గా ఉండలేకపోయింది. దీంతో కోహ్లి తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఇందుకు సంబంధించిన  వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నది. రెండు వీడియోలను పోలుస్తూ అభిమానులు మీమ్స్, జోక్స్ పేలుస్తున్నారు. 

 

ఇండియా 246-8 

ఇక లీస్టర్షైర్ తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ లో భారత జట్టు తడబడింది. నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ లో భాగంగా లీస్టర్షైర్ తో మ్యాచ్ ఆడుతున్న భారత జట్టు.. తొలి రోజు 60.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. టీమిండియా ప్రధాన బ్యాటర్లంతా విఫలమయ్యారు. రోహిత్ శర్మ (25), శుభమన్ గిల్ (21), హనుమా విహారి (3), విరాట్ కోహ్లి (33), శ్రేయస్ అయ్యర్ (0), రవీంద్ర జడేజా (13) లు అలా వచ్చి ఇలా వెళ్లారు. 81 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (111 బంతుల్లో 70 నాటౌట్.. 8 ఫోర్లు, 1 సిక్స్) టీమిండియాను ఆదుకున్నాడు. 

 

అతడికి టెయిలెండర్లు ఉమేశ్ యాదవ్ (23), మహ్మద్ షమీ (18 బ్యాటింగ్) అండగా నిలిచారు. లోయరార్డర్ సాయంతో భరత్.. టీమిండియా స్కోరును 200 దాటించాడు. వర్షం కారణంగా తొలి రోజు 60 ఓవర్ల ఆటే సాధ్యమైంది. 

Follow Us:
Download App:
  • android
  • ios