గత ఆరు నెలల నుంచి క్రికెట్‌కు దూరమైనప్పటికీ భారత సారథి విరాట్ కోహ్లీ తన టాప్ ర్యాంకును నిలుపుకున్నాడు. తాజాగా ప్రకటించిన ఐసీసీ వన్డే ప్లేయర్ల ర్యాంకింగ్‌లో 871 పాయింట్లతో విరాట్ కోహ్లీ టాప్‌లో నిలిచాడు. ఇండియన్ ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ 855 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

పాక్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజమ్, రాస్ టేలర్, డుప్లిసిస్, కేన్ విలియంసన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఆసీస్‌పై అద్భుత సెంచరీ చేసిన జానీ బెయిర్ స్టో పదో స్థానానికి ఎగబాకాడు. బౌలర్లతో బుమ్రా రెండో స్థానంలో ఉండగా న్యూజిలాండ్ బౌలర్ ట్రెండ్ బౌల్ట్ టాప్‌లో ఉన్నాడు.

టెస్టు ర్యాంకింగ్స్‌లో స్టీవ్ స్మిత్ టాప్‌లో ఉండగా, విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఛతేశ్వర్ పుజారా ఏడో ర్యాంకులో, రహానే పదో ర్యాంకులో ఉన్నారు. బౌలర్లలో బుమ్రా తొమ్మిదో ర్యాంకులో ఉండగా ఆల్‌రౌండర్లలో జడేజా 3, అశ్విన్ 5 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.