టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని ఆటకు ప్రపంచ నలుమూలల్లో అభిమానులు ఉన్నారు. ఆట ఎంత బాగా ఆడతాడో... ఫిట్ నెస్ విషయంలో కూడా అంతే శ్రద్ధ తీసుకుంటాడు. ఫుడ్ విషయంలో చాలా కంట్రోల్డ్ గా ఉంటాడు. చీట్ డేస్ కూడా చేయడు. సమయం దొరికినప్పుడల్లా జిమ్ లో కసరత్తులు కూడా చేస్తుంటాడు. 

అయితే... బ్యాటింగ్ చేసేటప్పుడు కోహ్లీ ఒక దాని గురించి బాగా ఆలోచిస్తూ ఉంటాడట. కొంపదీసి తన భార్య అనుష్క శర్మ గురించి అనుకొని పొరపాటు పడకండి. ఓ తినే పదార్థం గురించి ఆలోచిస్తాడట. ఈ విషయాన్ని కోహ్లీనే స్వయంగా తన సోషల్ మీడియాలో తెలియజేశాడు.

Also Read వడాపావ్ ఎలా తినాలని అడిగిన రహానే...ఫన్నీగా వివరించిన సచిన్ టెండుల్కర్...

తనకు చోలే బటూరే( గుజరాతీ వంటకం.. చూడటానికి పూరీలా ఉంటుంది) అంటే ఇష్టమట. తన బ్యాటింగ్ చేసేటప్పుడు బాల్ ని చూస్తే ఈ ఫుడ్ గుర్తుకు వస్తుందట. ఆ వంటకాన్ని ఎంత ఇంట్రస్ట్ తో చూస్తానో.. బాల్ ని కూడా అలానే చూస్తాను అని కోహ్లీ పేర్కొనడం విశేషం.

కాగా... కోహ్లీ పెట్టిన ఈ పోస్ట్ కి నెటిజన్ల నుంచి స్పందన బాగా వస్తోంది. రకరకాల ఫన్నీ రిప్లైలు ఇస్తున్నారు. దీనిపై ఇప్పటికే నెట్టింట మీమ్స్ కూడా పుట్టుకు వచ్చాయి. కాగా... ఢిల్లీ పౌరులు అందరూ చోలే బుటూరేని బాగా ఇష్టపడతారు. కాగా గతంలోనూ బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ అనే కార్యక్రమంలో రాజౌరీ గార్డెన్ లో చోలే బటూరే గురించి కోహ్లీ చాలా గొప్పగా చెప్పాడు.