వడాపావ్ ఎలా తినాలని అడిగిన రహానే...ఫన్నీగా వివరించిన సచిన్ టెండుల్కర్

పేదాగొప్ప తేడాలను చెరిపేసే ఈ స్కాక్‌ అంటే మరాఠ ప్రజలతో పాటు దేశంలోని చాలామంది ఇష్టంగా తింటారు. రహానే టెండూల్కర్ ని ఎలా ఈ వడాపావ్ గురించి అడిగాడు అనే విషయానికి  వస్తే... నిన్న శుక్రవారం నాడు వడాపావ్ తింటుంటే, టీమిండియా టెస్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానేకు ఒక డౌట్ వచ్చిందట. 

Sachin Tendulkar's Reply On Ajinkya Rahane's "Vada Pav" Tweet trends Over Internet

మిసల్ పావ్ నుంచి పావ్ బాజీ వరకు రకరకాల స్నాక్స్ మహారాష్ట్ర ప్రత్యేకం. పావ్ స్నాక్స్ ఎన్ని ఉన్నప్పటికీ వాటన్నిటిలో వడ పావ్ ప్రత్యేకం. అలా బున్ ను రెండుగా కట్ చేసి మధ్యలో వడ పెట్టేసి దాన్ని చట్నీ లో అద్దుకొని తింటే.... ఆ మజానే వేరు. 

సేమ్ ఇలాగే లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా స్పందించాడు. వడ పావ్ పై తనకున్న అమితమైన ప్రేమను చాటుకున్నాడు. సచిన్ టెండూల్కర్ ఈ విధంగా వడ పావ్ మీద  తన ఇష్టాన్ని మరోసారి బయటకు చెప్పడానికి కారకుడు మాత్రం అజింక్య రహానే. 

పేదాగొప్ప తేడాలను చెరిపేసే ఈ స్కాక్‌ అంటే మరాఠ ప్రజలతో పాటు దేశంలోని చాలామంది ఇష్టంగా తింటారు. రహానే టెండూల్కర్ ని ఎలా ఈ వడాపావ్ గురించి అడిగాడు అనే విషయానికి  వస్తే... నిన్న శుక్రవారం నాడు వడాపావ్ తింటుంటే, టీమిండియా టెస్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానేకు ఒక డౌట్ వచ్చిందట.

Also read: కేఎల్ రాహుల్ ముప్పు: ధావన్ మీద వ్యాఖ్యలపై కోహ్లీ స్పందన ఇదీ... 

దీంతో తన సందేహాన్ని నివృతి చేసుకునేందుక వెంటనే ట్విటర్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు. ‘మీకు వడా పావ్‌ ఎలా తినడం ఇష్టం?" అనేది ట్వీట్. దాని కింద ఆప్షన్స్ కూడా ఇచ్చాడండోయ్. మొదటి ఆప్షన్ గా చాయ్‌తో వడా పావ్‌ అని ఒరుకొనగా... రెండవ ఆప్షన్ గా చట్నీతో వడా పావ్‌, మూడవ ఆప్షన్ గా ఓన్లీ వడా పావ్‌ అని ఒప్షన్స్ ఇచ్చాడు. 

అందరూ ఎలా తింటారో తెలుసుకోవాలని భావించిన రహానే తన మనసులోని సందేహాన్ని ఇలా ట్వీట్‌ రూపంలో బయటపెట్టాడు. ట్విట్టర్ లో పోస్ట్ చేసాక ఇక డైరెక్ట్ ఆన్సర్స్ ని ఊహించడం కష్టం. అంతా క్రియేటివిటీనే. 

రహానే అడిగిన ప్రశ్నకు ఫ్యాన్స్‌ వినూత్నంగా సమాధానం ఇచ్చారు. ఇక వాడపావ్ అభిమానులకు కొదవా చెప్పండి. పనిలో పనిగా టెండుల్కర్ కూడా తన వాడపావ్ లవ్ ని బయట పెట్టుకున్నాడు. 

రహానే ట్వీట్‌కు రియాక్ట్ అయినా మాస్టర్‌ బ్లాసర్‌ తనకు వడా పావ్‌ని ఎర్ర చట్నీతో, కాస్త గ్రీన్ చట్నీ, ఇంకాస్త చింతపండు చట్నీతో తినడం చాలా ఇష్టమని సచిన్‌ రీట్వీట్‌ చేశాడు.  ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ట్వీట్‌లు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. 

Also read: అది నా తలనొప్పి కాదు: కేఎల్ రాహుల్ పై పోటీపై శిఖర్ ధావన్

బేసికల్ గా సచిన్‌ మంచి భోజనప్రియడు. తినేవాడికి వండడం కూడా రావాలని నమ్మే సచిన్ స్వతహాగా మంచి చెఫ్ కూడా. తన మనసుకు నచ్చిన వంటకాలను తన సన్నిహితులకు రుచి చూపిస్తుంటాడు. ఒకవేళ సచిన్ కి ఆ వంటకం వండడం రాకపోతే... నేర్చుకొని మరీ రుచి చూపించి తీరతాడు. 

ఇదే వడాపావ్ పై అతని ప్రేమను గతంలో కూడా బయటపెట్టాడు సచిన్. ఓ ఇంటర్వ్యూలో తాను, తన కొడుకు అర్జున్ ఇద్దరం కలిసి శివాజీ పార్క్ వద్ద వడపావ్ తింటుంటామని, ఈ స్నాక్‌కి ధీటైన ఫుడ్ మరొకటి లేదని సచిన్‌ అభిప్రాయపడ్డాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios