విశాఖపట్నం: తొందరపడి ఓ కోయిల ముందే కూసిందని ఓ కవి అన్నాడు. అదే పనిచేశాడు భారత బ్యాట్స్ మన్ శ్రేయాస్ అయ్యర్. విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డే మ్యాచులో శ్రేయాస్ అయ్యర్ అర్థ సెంచరీ పూర్తి కాకుండానే బ్యాట్ ను గాలిలోకి ఎత్తి వేడుక చేసుకున్నాడు. అయితే, అప్పటికి అతని అర్థ సెంచరీ పూర్తి కాలేదు. అర్థ సెంచరీకి మరో పరుగు దూరంలో ఉన్నాడు. 

కీమో పాల్ 48వ ఓవరులో వేసిన బంతిని తరలించి శ్రేయాస్ అయ్యర్ సింగిల్ తీశాడు. వెంటనే బ్యాట్ ను పైకెత్తి సంబరపడ్డాడు. అయితే, ఆ సింగిల్ తో శ్రేయాస్ అయ్యర్ వ్యక్తిగత స్కోరు 49 పరుగులు మాత్రమే అయింది. 

Also Read: క్రికెట్ లోనే కాదు అక్కడ కూడా కొహ్లీనే టాప్

శ్రేయాస్ అయ్యర్ తప్పును పెవిలియన్ నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇతర జట్టు సభ్యులు కరెక్ట్ చేశారు. విరాట్ కోహ్లీ వెంటనే లేచి హడావిడి చేస్తూ సెలబ్రేషన్ ఆపాలని శ్రేయాస్ అయ్యర్ కి సైగ చేశాడు. విరాట్ కోహ్లీ అలా సైగ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ల సెంచరీలతో, ఆ తర్వాత రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ దూకుడుతో భారత్ 5 వికెట్ల నష్టానికి 50 ఓవర్లలో 387 పరుగులు చేసింది. దాంతో భారత్ వెస్టిండీస్ పై ఘన విజయం సాధించింది. 

Also Read: ఆయన్నే అడగండి: కోహ్లీ యానిమేటెడ్ సెలబ్రేషన్ పై పోలార్డ్ ఘాటు వ్యాఖ్య

శ్రేయాస్ అయ్యర్ మూడు బౌండరీలు, నాలుగు సిక్స్ లతో 53 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ 16 బంతుల్లో 39 పరుగులు చేశాడు. కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ సాధించాడు.