నేటి మ్యాచులో కూడా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఇలాంటి అనేక విమర్శలకు తావివ్వడమే కాకుండా రివ్యూ ని వేస్ట్ చేసాడనే విమర్శను అభిమానులు చేయడం విశేషం.

టీం ఇండియా న్యూజిలాండ్ పర్యటనలో యతీవ్ర విమర్శలను ఎదుర్కుంటున్న ప్లేయర్ ఎవరన్నా ఉన్నాడంటే అది ఖచ్చితంగా విరాట్ కోహ్లీనే. తాజాగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులోను విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. 

విరాట్ ఈ మ్యాచులో కూడా తనదైన ముద్ర వేయలేకపోయారు. విరాట్ కోహ్లీతో ఆత్మస్థైర్యం తగ్గుతుందేమో అన్న అనుమానం విరాట్ కోహ్లీ బ్యాటింగ్ శైలిని చూస్తే సగటు అభిమానులకు కలుగుతుంది. 

నేటి మ్యాచులో కూడా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఇలాంటి అనేక విమర్శలకు తావివ్వడమే కాకుండా రివ్యూ ని వేస్ట్ చేసాడనే విమర్శను అభిమానులు చేయడం విశేషం. నేడు క్రైస్ట్ చర్చి మ్యాచులో టీం సౌథీ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ అనవసర రివ్యూ ని తీసుకున్నాడు అది కూడా తీసుకోవాలా వద్ద అని ఆలోచిస్తూ తటపటాయిస్తూ ఆ రివ్యూ ని తీసుకున్నాడు. 

Scroll to load tweet…

వాస్తవానికి బాల్ పాడ్ కి తగలగానే సౌథీ చాలా కాన్ఫిడెంట్ గా అప్పీల్ కి వెళ్ళాడు. విరాట్ బాట్ వాస్తవానికి బాల్ కంటే చాలా దూరంలో ఉంది. బాల్ నేరుగా ప్యాడ్లను తాకడంతో పాటుగా అది ఆఫ్ స్టంప్ కి ఖచ్చితంగా తగిలేలా బాల్ ని చూసే ఎవ్వరికైనా అర్థమయితుంది. 

Scroll to load tweet…

అలాంటి పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ తటపటాయిస్తూ మయాంక్ పుజారాతో మాట్లాడి రివ్యూ కి వెళ్ళాడు. ఉన్న రెండు రివ్యూల్లో ఒక దాన్ని అప్పటికే మయాంక్ అగర్వాల్ తినేసాడు. ఉన్న మరో ఏకైక రివ్యూని విరాట్ కోహ్లీ వేస్ట్ చేయడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా రిఫరల్ లలో విరాట్ కోహ్లీది ఎంత చెత్త రికార్డుందో లెక్కలతోసహా పెడుతూ విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు. 

Scroll to load tweet…

13 సార్లు టెస్టుల్లో విరాట్ డిఆర్ ఎస్ ఉపయోగిస్తే కేవలం రెండు సార్లు మాత్రమే సక్సెస్ అయ్యాడని లెక్కలతోసహా పెట్టారు. ఒకరేమో విరాట్ ఇలా చేయడం అలవాటయిపోయిందంటే... మరొకరేమో విరాట్ ని సెల్ఫిష్ అంటూ మరో పోస్ట్ పెట్టారు. 

Scroll to load tweet…