కెప్టెన్ గా ఉండటం చాలా గొప్ప గౌరవమని పేర్కొన్నాడు. అయితే.. పని భారాన్ని తగ్గించుకోవడానికి ఇదే సరైన సమయంగా తాను భావించినట్లు చెప్పాడు. ఈ టోర్నీలో తమకు అనుకున్న ఫలితాలు రాలేదని.. కానీ తాము బాగానే ఆడామని కోహ్లీ పేర్కొన్నాడు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ( Virat Kohli) .. ఇటీవల షాకింగ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కెప్టెన్ గా తప్పుకుంటున్నట్లు ప్రకటించేశాడు. T20 Worldcup లో భాగంగా kohli కెప్టెన్ గా చివరి టీ20 మ్యాచ్ ఆడేశాడు. ఇక నుంచి.. కోహ్లీ కెప్టెన్ గా వ్యహరించబోడు. కేవలం.. బ్యాటర్ గా టీ20 జట్టులో కోహ్లీ కొనసాగనున్నాడు.

Also Read: ఆడించనప్పుడు అతన్ని ఎందుకు ఎంపిక చేశారు... సెలక్టర్ల తీరుపై హర్భజన్ సింగ్ అసంతృప్తి...

ఈ సందర్భంగా.. కోహ్లీ మీడియాతో మాట్లాడారు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత చాలా రిలీఫ్ గా ఉందని కోహ్లీ పేర్కొన్నాడు. కెప్టెన్ గా ఉండటం చాలా గొప్ప గౌరవమని పేర్కొన్నాడు. అయితే.. పని భారాన్ని తగ్గించుకోవడానికి ఇదే సరైన సమయంగా తాను భావించినట్లు చెప్పాడు. ఈ టోర్నీలో తమకు అనుకున్న ఫలితాలు రాలేదని.. కానీ తాము బాగానే ఆడామని కోహ్లీ పేర్కొన్నాడు.

‘‘టీ20 క్రికెట్‌ భిన్నమైంది. మొదటి రెండు ఓవర్లలో ఎవరు పైచేయి సాధిస్తారో వారి అధిపత్యం కొనసాగుతుంది. తొలి రెండు మ్యాచ్‌లలో మేం ఇదే మిస్సయ్యాం. ఇది వరకు చెప్పినట్లుగానే.. ఆ మ్యాచ్‌లలో మేము తెగించి ఆడలేకపోయాం. అది నిజంగా కఠిన సమయం. రవి భాయ్‌... సహాయక సిబ్బందికి ధన్యవాదాలు. సుదీర్ఘకాలంగా వారు గొప్పగా పనిచేస్తున్నారు.

Also Read: ఆ విషయంలో విరాట్ కోహ్లీని దాటేసిన రోహిత్ శర్మ... కెప్టెన్సీకి ముందు ‘హిట్ మ్యాన్’ ఖాతాలో...

ఆటగాళ్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేలా కృషి చేశారు. ఇంకో మాట.. ఇకపై కూడా మునుపటి దూకుడు కొనసాగుతుంది. ఆ దూకుడే గనుక చూపనినాడు నేను క్రికెట్‌ ఆడటం మానేస్తాను. కెప్టెన్‌ కాకముందు కూడా జట్టు విజయాలలో నా వంతు పాత్ర పోషించాను. అలాగే ముందుకు సాగుతాను’’ అంటూ నమీబియాపై టీమిండియా విజయం అనంతరం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఈ మేరకు ఉద్వేగపూరితంగా మాట్లాడాడు.

భారత జట్టు టీ20 సారథిగా తనకు ఇదే చివరి మ్యాచ్‌ కావడంతో ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన కోచ్‌లు, సహాయక సిబ్బంది, సహచర ఆటగాళ్లకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇకపై పూర్తిస్థాయిలో బ్యాటర్‌గా తన సేవలు అందిస్తానని చెప్పుకొచ్చాడు. కాగా టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో భాగంగా టీమిండియా నవంబరు 8న తమ చివరి మ్యాచ్‌ ఆడింది.

టీ20 ప్రపంచకప్‌లో ఫేవరెట్‌ జట్టుగా బరిలోకి దిగిన కోహ్లి సేన.. కనీసం సెమీస్‌ చేరకుండానే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నమీబియాతో నామమాత్రపు మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 4 ఓవర్లలో కేవలం 16 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజా మరోసారి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.