కరోనా కరాళ నృత్యానికి ప్రపంచం వణికిపోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ వైరస్ విలయతాండవానికి భారతదేశం కూడా భారీ మూల్యం చెల్లించుకోకముందే... ముందు జాగ్రత్తగా దేశమంతా లాక్ డౌన్ ప్రకటించారు ప్రధాని మోడీ. 

తొలుత జనతా కర్ఫ్యూ అని ప్రజలను సిద్ధం చేసిన ప్రధాని ఒకేసారి మూడు వారాలపాటు లాక్ డౌన్ ని ప్రకటించారు. ఇలా లాక్ డౌన్ ప్రకటించడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చైన్ ని బ్రేక్ చేస్తే వైరస్ ఇక వ్యాపించకుండా చేయొచ్చనేది ప్రభుత్వ ఆలోచన. 

ఇక ఈ వైరస్ ఇలా విస్తరిస్తుండడంతో దేశమంతా ఇదవరికే క్రీడా ఈవెంట్లను రద్దు చేసింది భారత ప్రభుత్వం. ఆ తరువాత ఖాళీగా ఉన్న క్రీడాకారులు తమ విరామ సమయాన్ని ఎంజాయ్ చేయడంతోపాటుగా అభిమానుల్లో, సామాన్య ప్రజల్లో ఈ కరోనా మహమ్మారిపై అవగాహనా తీసుకొచ్చేనందుకు ట్రై చేస్తున్నారు.  

పది సంవత్సరాలుగా తీరిక లేకుండా క్రికెట్‌తో గడిపిన విరాట్‌ కోహ్లి ప్రస్తుతం న్యూఢిల్లీలోని ఇంట్లో భార్య అనుష్క శర్మతో కలిసి ఉంటున్నాడు. ఇద్దరు బిజీ రంగాలకు చెందినవారవడంతో.... ఇంట్లో క్వాలిటీ టైం ఎంజాయ్ చేస్తున్నారు. 

 Also Read:రూ.800కోట్ల ఆదాయం..కరోనా బాధితుకు రూ.లక్ష విరాళం.. ధోనీపై ట్రోల్స్  

విరామ సమయంలో ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన విరాట్‌ కోహ్లి, లాక్‌డౌన్‌పై అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశాడు. కష్టకాలంలో దేశానికి అందరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చాడు. వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా మేల్కొని నడుచుకోవాలని, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా మెలగాలి అభిమానులను కోరాడు విరాట్ కోహ్లీ. 

కరోనాపై చేస్తున్న యుద్ధం సాధారణమైన యుద్ధం కాదని, లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో ప్రజలు వీధుల్లోకి రావటం పట్ల తాను అసంతృప్తిగా ఉన్నానని అసహనం, ఆవేదన వ్యక్తం చేసాడు. ప్రభుత్వ ఆదేశాలను విధిగా పాటించాలని, ఇది దేశానికి అందరూ మద్దతుగా నిలవాల్సిన సమయమని ట్విటర్‌ లో ఓ వీడియోను కోహ్లి ట్వీట్‌ చేశాడు.

ఇక ఈ వీడియో పోస్ట్ చేయగానే విరాట్ అభిమానులు, క్రికెట్ అభిమానులు అంతా ముందు డబ్బులు డొనేట్ చేయండి. డొనేషన్లు ఎక్కడ అంటూ ఫైర్ అయ్యారు. తాజాగా ధోని లక్ష రూపాయలు ఇచ్చదనగానే కూడా ఫ్యాన్స్ ఫైర్ అయినా విషయం తెలిసిందే. 

ఇక మిగిలిన క్రికెటర్లు కూడా ఖాళీ సమయంలో ఇంటికే పరిమితమయ్యారు. తాజాగా భారత యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఖాళీ సమయంలో ఫిట్‌నెస్‌ మెరుగు పరచుకునేందుకు యత్నిస్తున్నాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం బీసీసీఐ ఓ వీడియోను తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. 

కోవిడ్ 19 కారణంగా ప్రధాని నరేంద్రమోడీ 21 రోజులు దేశంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో ఈ ఖాళీ సమయాన్ని పంత్ ఉపయోగించుకుంటున్నాడు. అందులో భాగంగా రిషభ్ పుష్‌అప్‌లు, ట్రెడ్‌మిల్‌పై పరుగులు తీయడం వంటి పనులు చేస్తున్నాడు.

Also Read:హెడ్డింగ్ కాదు.. వార్త మొత్తం చదువు.. అభిమానికి స్టోక్స్ పంచ్

ఈ వారం ప్రారంభంలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ భార్యతో గడిపిన వీడియోలను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ధావన్ బట్టలు  ఉతకడం, వాష్‌రూమ్‌ శుభ్రం చేస్తున్నాడు. అయితే ఆ సమయంలో అతని భార్య స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించింది.

ఈ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో బాలీవుడ్ హిట్ సాంగ్ ‘‘జబ్ సే హుయ్ హై షాదీ’’ ప్లే అవుతోంది. కాగా భారత్- దక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సిన మూడు వన్డేల సిరీస్‌ కరోనా కారణంగా వాయిదా పడింది. దీనితో పాటు ఐపీఎల్ 2020 కూడా ఏప్రిల్ 15 వరకు వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే.